కోడలు, కుమారుడు నెలల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడటాన్ని ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. కుమారుడి బలవన్మరణానికి పాల్పడిన రెండు రోజుల తరువాత అనారోగ్యంతో ఆమె కూడా మరణించింది. ఈ ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది.
కొన్ని నెలల కిందట కోడలు బలవన్మరణానికి పాల్పడింది. దీని తట్టుకోలేక కొడుకు మనస్థాపానికి గురయ్యాడు. మూడు రోజుల కిందట అతడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న అతడి తల్లి దీనిని తట్టుకోలేకపోయింది. నెలల వ్యవధిలో కుటుంబంలో ఇలా జరగడం పట్ల తీవ్ర మనస్థపానికి గురైంది. ఎంతో తల్లిడిల్లి చనిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యాంసుందర్ అనే వ్యక్తికి హుస్నాబాద్ కు చెందిన శారద అనే మహిళతో వివాహం జరిగింది. అతడికి 65 ఏళ్ల తల్లి బొల్లంపల్లి కనకలక్ష్మి, తండ్రి కనకయ్యతో పాటు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అయితే అతడికి గతేడాది మే 15వ తేదీన పెళ్ల జరిగింది. కానీ పలు కారణాల వల్ల ఎనిమిది నెలల క్రితం భార్య శారద తన పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది.
3 నెలల్లోగా లావు తగ్గండి.. అయినా ఫిట్ గా మారకపోతే వీఆర్ఎస్ తీసుకోండి - పోలీసులకు డీజీపీ వార్నింగ్
భార్య చనిపోవడంతో శ్యాంసుందర్ మనస్థాపానికి గురయ్యాడు. పెళ్లి రోజు సమీపిస్తుండటంతో దాని కంటే ఒక రోజు ముందు అంటే మే 14వ తేదీన భార్య ఆత్మహత్య కు పాల్పడిన చోటే అతడూ బలవన్మరానికి పాల్పడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అతడి మృతి పట్ల తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయింది.
చనిపోయిన ముస్లిం మహిళను గెలిపించిన ఓటర్లు.. యూపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం..
సోమవారం సొంత ఊరికి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం సోమవారం రాత్రి సమయంలో తల్లి కనకలక్ష్మికి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. కొంత కాలం వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇన్ని ఘటనలు జరగడం గ్రామాన్ని విషాదంలో మంచెత్తింది.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
