Nampally fire Accident : నాలుగు రోజుల కిందట ఈలోకంలోకి వచ్చిన పసికందు అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. నాంపల్లి అగ్నిప్రమాదంలో నాలుగు రోజుల వయస్సున్న చిన్నారి చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Nampally fire Accident : హైదరాబాద్ లోని నాంపల్లిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మొత్తంగా 9 మంది మరణించారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో నాలుగు రోజుల పసికందు కూడా ఉందని తెలుస్తోంది. మరణించిన 9 మందిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. నాలుగు రోజుల కిందట జన్మించిన శిశువు.. ఈ ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి, ఒకరికి గాయాలు

కాగా.. నాంపల్లి బజార్ ఘాట్ లో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఉదయం 9.45 గంటలకు మొదలైన ఈ అగ్నిప్రమాదంలో 9 చనిపోయారు. ఇందులో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ నాలుగు రోజుల చిన్నారి ఉంది. మరో కొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో కొందరు అపస్మారక స్థితిలోకి చేరుకోగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వీరంతా ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

ప్రశ్నించేందుకు జనసేన పుట్టిందన్న పవన్ కల్యాణ్ మౌనమెందుకు ? - సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రస్తుతం ప్రమాదం జరిగిన కెమికల్ గోడౌన్ ఓ అపార్ట్ మెంట్ కింది భాగంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటోంది. అది జీ ప్లస్ 4 అంతస్తుల భవనం. ఉదయం వేళ మంటలు వ్యాపించి.. పొగలు సెకన్లలో 4వ అంతస్తుకు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి పోలీసులు, ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ భవనంతో మొత్తం 60మంది నివాసం ఉంటున్నారు. కెమికల్ అంటుకుని పొగలు 4వ అంతస్తు వరకు వ్యాపించాయి.

Scroll to load tweet…

కాగా.. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ స్పందించారు. నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తక్షణమే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు.