Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ... రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే రూట్లలో అంటే..?

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ అమల్లో వుంటాయని అధికారులు తెలిపారు. 

traffic restrictions in hyderabad on tomorrow over pm narendra modi telangana visit
Author
First Published Nov 11, 2022, 7:07 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రధానంగా బేగంపేట్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఆంక్షలు అమల్లో వుంటాయని తెలిపారు. పంజాగుట్ట, గ్రీన్‌లాండ్స్, ప్రకాశ్ నగర్ టీ జంక్షన్, రసూల్‌పురా టీ జంక్షన్ మార్గాల్లో వాహనాల మళ్లింపు వుంటుందని నగర ప్రజలు సహకరించాలని వారు కోరారు. అలాగే సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్ కూడలి పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ అమల్లో వుంటాయని అధికారులు తెలిపారు. 

ALso Read:మోడీ, కేసీఆర్ ల మధ్య మళ్లీ ప్రోటోకాల్ రగడ.. అయిపోయిన పెళ్లికి బాజాలా?

ఇదిలా ఉండగా, రామగుండంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణకు రానున్నారు. మోదీ నవంబర్ 12న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి హెలికాప్టర్‌లో రామగుండం బయలుదేరి, ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని అదే రోజు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే, ఇటీవల గత కొన్నిసార్లు జరుగుతున్నట్టుగానే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు  ప్రధానికి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకడం గానీ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడంగానీ చేయరని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. 

ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లి కలవాల్సి ఉంటుంది. కాగా, గత ఫిబ్రవరిలో నగర శివార్లలోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో సమతా విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ వెళ్లలేదు. అప్పటి నుంచి మోదీ పర్యటనలన్నింటినీ ఆయన దాటవేశారు. కేసీఆర్ ప్రోటోకాల్‌ను పాటించకపోవడానికి ప్రధానమంత్రి 'ప్రైవేట్ పర్యటనలు' కారణమని CMOలోని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే, RFCL ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం. ఇక దీనికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం RFCL ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రికి కేంద్రం ఆహ్వానం పంపుతుందని అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios