Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్.. చలాన్లను రెవెన్యూ జనరేషన్‌గా చూడటంలేదు: ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నట్టుగా ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 28 నుంచి రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ చేపట్టనున్నట్టుగా చెప్పారు. 

Traffic Police Joint Commissioner Ranganath On New Traffic Rules in Hyderabad
Author
First Published Nov 21, 2022, 6:07 PM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నట్టుగా ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 28 నుంచి రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ చేపట్టనున్నట్టుగా చెప్పారు. జీవో ప్రకారమే కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయనున్నట్టుగా తెలిపారు. సోమవారం రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రూల్స్ కొత్తగా తీసుకొచ్చినవి కావని చెప్పారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌లపై జరిమానాలు పెంచుతున్నట్టుగా చెప్పారు. 

ఏ వాహనాల వల్ల డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందో వాటికి ఎక్కువ జరిమానాలు విధిస్తున్నట్టుగా చెప్పారు. జీవో ప్రకారమే నిబంధనలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌ల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. యూటర్న్‌లు మరి దూరంగా ఉన్నచోట.. ప్రజల సౌకర్యార్థంగా కొన్నిచోట్ల యూటర్న్స్ ఏర్పాటు చేసే అంశంపై ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పారు. వచ్చే సోమవారం స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టినట్టుగా తెలిపారు. 

రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు సంబంధించి పోలీసులు వాహనదారులను ఆపి చలాన్లు విధించవచ్చని.. లేకపోతే ఫొటోలు, వీడియోలు తీసి చలాన్లు విధించవచ్చని చెప్పారు. అయితే వాహనాలపై విధించే జరిమానాలతోనే పోలీసు వ్యవస్థ అంతా నడుస్తోందని చెప్పడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం పోలీసుల శాఖకు కేటాయించే బడ్జెట్ వేల కోట్లలో ఉంటుంది. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించిన సమయంలో వచ్చిన మొత్తం రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అని చెప్పారు. వాహనాలపై చలాన్లు విధించడం వచ్చే ఆదాయంతో పోలీసు యంత్రాంగం అంతా నడుస్తుందనేది తప్పుడు అభిప్రాయం అని అన్నారు.  జరిమానాలు విధించడాన్ని రెవెన్యూ జనరేషన్‌గా ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ చూడటం లేదన్నారు. డిసిప్లేన్, పద్దతిని పాటించే విధంగా చేయడానికి చలాన్లు విధిస్తున్నట్టుగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios