నేటి అర్థరాత్రి నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాల పరుగులు
మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్జీసీఎల్) నిర్ణయించాయి.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్జీసీఎల్) నిర్ణయించాయి.
ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్పై టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది.
ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ టాగ్ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్ టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఏ సూచించింది.
కర్ఫ్యూ అమలులో ఉన్న వేళలు(రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ) ఓఆర్ఆర్పై కార్లను అనుమతించడం జరగదు.
ఓఆర్ఆర్పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్ వెహికిల్స్)లో ప్రయాణీకులున్నట్లుగా టోల్ ప్లాజా సిబ్బంది గుర్తించిన స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హహెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.