Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో వర్షబీభత్సం: రోడ్లపైకి పోటెత్తిన వర్షపునీరు.. భారీగా ట్రాఫిక్ జాం, కూకట్‌పల్లిలో పిడుగుపాటు

భారీ వర్షం ధాటికి హైదరాబాద్‌ (hyderabad Rains) మహానగరం అతలాకుతలమైంది. రహదారులు జలమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జాం (traffic jam) అయ్యింది. దీంతో వాహనదారులు ఎప్పుడు ఇళ్లకు చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. 

traffic jam in hyderabad due to heavy rain
Author
Hyderabad, First Published Oct 9, 2021, 9:27 PM IST

భారీ వర్షం ధాటికి హైదరాబాద్‌ (hyderabad Rains) మహానగరం అతలాకుతలమైంది. రహదారులు జలమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జాం (traffic jam) అయ్యింది. దీంతో వాహనదారులు ఎప్పుడు ఇళ్లకు చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, అసెంబ్లీ వద్దకు భారీగా వర్షపు నీరు పోటెత్తింది. దీంతో ఎంజే మార్కెట్‌, నాంపల్లి నుంచి అసెంబ్లీ, లక్డీకాపూల్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సైతం చేతులెత్తేశారు. మూసారాంబాగ్‌ వంతెనపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ నుంచి కింగ్‌కోఠి వైపు మార్గంలో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి.   

Also Read:Hyderabad rains: ప్రజలెవరూ బయటికి రావొద్దు ... మరికొన్నిగంటల పాటు వర్షం, ఇవీ తాజా అప్‌డేట్స్

ఇక కూకట్‌పల్లి (kukatpally) వెంకటేశ్వర నగర్‌లో నాలుగు అంతస్తుల భవనంపై పిడుగుపడింది. ఈ ప్రమాదంలో భవనం గోడలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పెద్ద చెరువులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మజీద్‌పూర్‌కు చెందిన అనిల్‌ చేపలుపట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. మునగనూరు నుంచి హయత్‌నగర్ వెళ్లే మార్గంలో వరద ఉద్ధృతికి బైక్ కొట్టుకుపోయింది. అటు భారీ వర్షం ధాటికి చంపాపేట, కోదండరామ్‌నగర్‌, బంజారా కాలనీ, జిల్లెలగూడ, హయత్‌నగర్‌ బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పౌరులు త‌మ ప్ర‌యాణ ఏర్పాట్లు చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. భారీ వ‌ర్ష సూచ‌న నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ (drf teams) బృందాలు అల‌ర్ట్ అయ్యాయి. అత్యవసర సహాయం కోసం జీహెచ్ఎంసీ (ghmc) కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ప్రజలు ఎమర్జెన్సీ సమయంలో 040-21111111కు సంప్రదించాలని అధికారులు సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios