Asianet News TeluguAsianet News Telugu

ఎస్సీ, ఎస్టీలు ఎదిగితే సహించలేరు.. సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్ విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గిరిజన రేజర్వేషన్ల కోసం గురువారం ఉదయం నిరసన దీక్ష చేపట్టిన రాములునాయక్‌తో దీక్ష విరమింపజేసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు

tpcc Uttam Kumar reddy pressmeet in Gandhi Bhavan over tribal reservation
Author
Hyderabad, First Published Jun 11, 2020, 8:10 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గిరిజన రేజర్వేషన్ల కోసం గురువారం ఉదయం నిరసన దీక్ష చేపట్టిన రాములునాయక్‌తో దీక్ష విరమింపజేసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.

Also Read:కాలువల కంటే టన్నెల్ నిర్మాణం చవక.. కాలేశ్వరంపై.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎస్సీ, ఎస్టీల్లో ఎవరైనా ఎదిగితే కేసీఆర్ సహించరని.. టీఆర్ఎస్‌లో మొదటి నుంచి వున్న వారిని కూడా కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారని... కానీ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా ఎందుకు కల్పించలేదని ఉత్తమ్ ప్రశ్నించారు.

జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. ఒక్క జీవోతో జరిగే పనికి కేంద్రం పేరు చెప్పి తప్పించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read:ఛలో సెక్రటేరియట్: ఉత్తమ్ సహా పలువురు కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. వాటిని సాగు చేసుకునే హక్కును ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని ఆయన గుర్తుచేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios