పార్టీ ఆదేశాలను పాటించని నేతలపై వేటు: ఎఐసీసీకి టీపీసీసీ నివేదిక
లాక్ డౌన్ సమయంలో ఎఐసీసీ అధినేత సోనియాగాంధీ ఆదేశాలను పట్టించుకోని పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని పీసీసీ భావిస్తోంది. ఈ మేరకు నేతల వివరాలను పీసీసీ నాయకత్వం సేకరిస్తోంది.
హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో ఎఐసీసీ అధినేత సోనియాగాంధీ ఆదేశాలను పట్టించుకోని పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని పీసీసీ భావిస్తోంది. ఈ మేరకు నేతల వివరాలను పీసీసీ నాయకత్వం సేకరిస్తోంది.
లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పీసీసీలకు సూచనలు చేసింది. మరో వైపు ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు భరోసా కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క రోజు దీక్షకు దిగారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్లు ఇవాళ దీక్షలో పాల్గొన్నారు.జిల్లాల్లో కూడ పలువురు నేతలు దీక్షల్లో పాల్గొన్నారు.
also read:రైతుల సమస్యలపై కాంగ్రెస్ దీక్షలు: గాంధీ భవన్ లో ఉత్తమ్ సహా పలువురి నిరసన
పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా దీక్షలకు దూరంగా ఉన్న నేతలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.లాక్ డౌన్ సహాయక చర్యలు, దీక్షలకు దూరంగా ఉన్న నేతల సమాచారాన్ని పీసీసీ నాయకత్వం సేకరిస్తోంది.
also read:కరోనా రోగులకు డాక్టర్ ఫ్యామిలీ సేవలు: తల్లీదండ్రులతో కలిసి కొడుకు ట్రీట్‌మెంట్
పదవుల్లో ఉంటూ ఆదేశాలు పాటించని వారిని తొలగించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. పార్టీ ఆదేశాలను పాటించని నేతల సమాచారాన్ని సేకరించి ఎఐసీసీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదిక పంపారు.
తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ ను మార్చాలని కొంత కాలంగా డిమాండ్ కొనసాగుతోంది. ఈ పదవి నుండి తప్పుకొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.