హైదరాబాద్:కరోనా రోగులకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వైద్యులు సేవలు అందిస్తున్నారు. కరోనా రోగులకు హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఆసుపత్రిని కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో మార్చి మొదటివారంలో కరోనా కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుండి వచ్చిన వారికి కరోనా సోకిన విషయాన్ని వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. గాంధీ ఆసుపత్రిని కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

also read:ఢిల్లీలో వెయ్యి మంది తెలుగు విద్యార్థులు: ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని వినతి

ఈ గాంధీ ఆసుపత్రిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు డాక్టర్లు కరోనా రోగులకు సేవ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ సుబోధ్ కుమార్ పనిచేస్తున్నారు. ఆయన భార్య కృష్ణవేణి కూడ డాక్టరే. ఆమె గైనకాలజిస్టు. ఇదే ఆసుపత్రిలో కృష్ణవేణి గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. గైనకాలజీ విభాగంలో అసోసియేష్ ప్రొఫెసర్ గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు.

సుబోధ్ కుమార్ దంపతుల కొడుకు శుశ్రుత్ కూడ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇదే ఆసుపత్రిలో ఆయన హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నాడు. ముగ్గురు ఒకే ఆసుపత్రిలో రోగులకు సేవలు చేయడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.