పోస్టుకార్డు ఉద్యమం: గాంధీ భవన్ లో ప్రారంభమైన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

గాంధీ భవన్ లో  టీపీసీసీ విస్తృతస్థాయి  సమావేశం ఇవాళ  జరిగింది.  రాష్ట్రంలో  రానున్న రోజుల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించనున్నారు. 

TPCC  Executive   Meeting  Begins  At Gandhi Bhavan  In  Hyderabad  lns

హైదరాబాద్: గాంధీ భవన్ లో  టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం  ఆదివారంనాడు  ప్రారంభమైంంది.  భవిష్యత్తులో  అనుసరించాల్సిన  వ్యూహంపై చర్చించనున్నారు. ఈ నెలలో  రాష్ట్రంలో  భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత  రాహుల్ గాంధీ ఎంపీపై  అనర్హత వేటు  పడింది. ఈ విషయమై  ప్రధాని నరేంద్ర మోడీకి  పోస్టు కార్డులు  రాయాలని  కాంంగ్రెస్ పార్టీ  నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి  పోస్టు కార్డు  ఉద్యమం నిర్వహించనున్నారు.  ఈ పోస్టు కార్డు ఉద్యమంపై  ఈ సమావేశంలో  చర్చించనున్నారు. 

ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు  జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ  పట్టుదలగా  ఉంది.   కాంగ్రెస్ పార్టీ  నేతలు  ఇప్పటికే  కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. 

మరో వైపు  ఈ  నెల రెండో వారంలో  రాష్ట్రంలో భారీ బహిరంగ సభను  నిర్వహించాలని  భావిస్తున్నారు. ఈ సభకు  ప్రియాంక గాంధీతో పాటు  రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ను  ఆహ్వానించాలని  కాంగ్రెస్ నేతలు  భావిస్తున్నారు. ప్రియాంకగాంధీ  సమయం ఇవ్వకపోతే  రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ను   ఆహ్వానించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.  రాష్ట్రంలో  ప్రస్తుతం  నెలకొన్న రాజకీయ పరిస్థితులపై  కూడా  చర్చిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios