Asianet News TeluguAsianet News Telugu

వనపర్తి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు.. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు, శంకర్ ప్రసాద్‌పై బహిష్కరణ వేటు

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వచ్చి క్లాస్ పీకినా తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలు ఇంకా కొట్టుకుంటూనే వున్నారు. తాజాగా వనపర్తి డీసీసీ మాజీ ప్రెసిడెంట్ శంకర్ ప్రసాద్‌పై పీసీసీ క్రమశిక్షణా కమిటీ బహిష్కరణ వేటు వేసింది. 

tpcc disciplinary committee take action on wanaparthy ex dcc president shankar prasad
Author
First Published Dec 31, 2022, 7:26 PM IST

వనపర్తి కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ ప్రసాద్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది క్రమశిక్షణా కమిటీ. దాంతో మాజీ మంత్రి చిన్నారెడ్డికి వ్యతిరేకంగా శంకర్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే శంకర్ ప్రసాద్ బహిష్కరణను యూత్ కాంగ్రెస్ తప్పుబడుతోంది. చిన్నారెడ్డిపై దిగ్విజయ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి. 

ఇక, ఇటీవల టీ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల ప్రకటన పెనుదుమారమే రేపిన సంగతి తెలిసిందే. అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుందని సీనియర్ నేతలు గళం వినిపించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. దీంతో వలస నేతలు వర్సెస్ ఒర్జినల్ కాంగ్రెస్ నేతలుగా సీన్ మారిపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ బ్యాగ్రౌండ్‌ ఉన్న 10 మందికిపైగా నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేయడంతో పార్టీలో సంక్షోభం మరింతగా ముదిరింది. 

ALso REad: మేం ఎవ్వరికీ గులాం కాదు.. నా కొడుక్కి పదవి రానివ్వలేదు, పనిచేయకుండానే అడిగామా : అంజన్ కుమార్ యాదవ్

ఈ క్రమంలోనే అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్.. నేతల  మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీలో పలువురు నేతలతో భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. పార్టీ నేతలతో సంప్రదింపుల అనంతరం గురువారం మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. నాయకులందరితో మాట్లాడనని చెప్పారు. పార్టీలో సమస్యలు అన్నీ సర్దుకున్నాయని .. విభేదాలపై నాయకులు బయట మాట్లాడొద్దని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios