Asianet News TeluguAsianet News Telugu

మోడీ విధానాలతోనే శతృవులుగా మారుతున్న పొరుగు దేశాలు: ఉత్తమ్

భారత్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడ మనకు శతృవులుగా మారుతున్నారని... ఇందుకు మోడీ అనుసరిస్తున్న విధానాలే కారణమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 
 

TPCC chief Uttam kumar reddy participates amaraveerulaku salam programme
Author
Hyderabad, First Published Jun 26, 2020, 1:28 PM IST


హైదరాబాద్:  భారత్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడ మనకు శతృవులుగా మారుతున్నారని... ఇందుకు మోడీ అనుసరిస్తున్న విధానాలే కారణమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

శుక్రవారం నాడు గాంధీభవన్ లో అమరవీరులకు సలాం కార్యక్రమంలో భాగంగా  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లతో పాటు పలువురు నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు.

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియాకు చుట్టూ ఉన్న దేశాలు ఒక్కొక్కటిగా శత్రువులుగా మారుతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.విదేశాంగ పాలసీ విదేశీ రక్షణలో కేంద్రం వైఫల్యం చెందిందన్నారు.శ్రీలంక, నేపాల్ దేశాలు కూడ ఇండియాకు దూరమౌతున్నాయని చెప్పారు.

చైనా ఆర్మీ భారత్ సరిహద్దులో నుండి వెనక్కి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. 45 ఏళ్ల కాలంలో ఇండియా చైనా సరిహద్దుల్లో ఒక్క సైనికుడు కూడ మరణించని విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మనతో స్నేహంగా ఉన్న దేశాలు కూడ మనకు దూరంగా జరుగుతున్నాయన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios