హైదరాబాద్: బ్యాలెట్ పద్దతిలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌కు వ్యతిరేక ఫలితమే వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు ఈవీఎంలపై తనకు అనుమానం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు ఎమ్మెల్సీగా  మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా పీసీసీ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి ఊపునిచ్చిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు అందరికీ షాక్ గురయ్యేలా వచ్చాయన్నారు. జీవన్ రెడ్డి అసెంబ్లీలో ఓటమి పాలైన తర్వాతే ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారన్నారు.

బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్గి గెలుపు సాధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అందుకే తనకు ఈవీఎంలపై అనుమానం వచ్చినట్టు చెప్పారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  కార్యకర్తలు జీవన్మరణ సమస్యగా తీసుకొని పోరాటం చేయాలని  ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అలా చేస్తే కేసీఆర్ సంగతి చూస్తాం: మల్లు భట్టి విక్రమార్క