హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ఎల్పీలో సిఎల్పీని విలీనం చేస్తే చూస్తూ ఊరుకొంటామా.....కేసీఆర్ సంగతి చూస్తామని అని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.

సోమవారం నాడు ఎమ్మెల్సీగా  మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా పీసీసీ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేసి చూడాలని ఆయన కోరారు. ఒకవేళ అదే జరిగితే నీ ప్రభుత్వం ఉంటుందా .. నువ్వు ఉంటావా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రాజ్యాంగ సంక్షోభాన్ని  తీసుకువస్తామని భట్టి స్పష్టం చేశారు. 

నాయకత్వ లోపం ఉందని  చెప్పడానికి సిగ్గుండాలని ఆయన కొందరు నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.వచ్చే ఐదేళ్లలో నీ చిట్టా విప్పుతాం.. అందరి సంగతి తేలుస్తామని కేసీఆర్‌పై భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.