Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ ఫలితాల్లో గందరగోళం సరిదిద్దాలి: కేసీఆర్ కు రేవంత్ ఓపెన్ లెటర్

ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకొన్న గందరగోళాన్ని సరి దిద్దాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో చోటు చేసుకొన్న గందరగోళాన్ని సరిదిద్దాలని ఆయన కోరారు.

TPCC Chief Revanth Reddy Writes letter To CM Kcr
Author
Hyderabad, First Published Dec 19, 2021, 3:39 PM IST

హైదరాబాద్:  ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే  రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఇంటర్ విద్యార్ధులు మరణించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ పరీక్షల్లో జరిగిన గందరగోళాన్ని సరిదిద్దాలని  ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు  సీఎం కేసీఆర్ కు Revanth Reddy  బహిరంగ లేఖ రాశారు.Inter పరీక్షల్లో Telangana ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. Corona  మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమయ్యారన్నారు.  

also read:ఇంటర్ స్టూడెంట్ల విషయంలో ఏం చేద్దాం.. తెలంగాణ సీఎంవో సమాలోచనలు..

Online క్లాసుల విధానం ప్రభుత్వం తెర మీదకు వచ్చిందని తెలిపారు. ఆన్ లైన్ విద్యాబోధనకు మౌలిక సదుపాయాల కల్పన అన్నది అత్యంత ప్రధానమన్నారు. Internet , కంప్యూటర్లు, లాప్ టాప్ లాంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు.  ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదువు కునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇవి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది ప్రశ్నార్థకమ‌మ‌న్నారు. అయితే ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు Kcr  ప్ర‌భుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 49 శాతం విద్యార్ధులు పాస్ కావడంపెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కనీస పాస్ మార్కులు వేసి ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులన పాస్ చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  రెండు మూడు రోజులుగా ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.  ఇంత తక్కువ ఉత్తీర్ణత శాతం ఎప్పుడూ కూడా నమోదు కాలేదనే అభిప్రాయాలను విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ స్టూడెంట్ల‌కు ఈ ఏడాది అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు 4,59,242 మంది స్టూడెంట్లు హాజ‌ర‌వ‌గా.. 2,24,012 మంది పాస్ అయ్యారు. ఇందులో సగం కంటే ఎక్కువ అంటే 2,35,230 మంది ఫెయిల్ అయ్యారు. గ‌డిచిన కొన్నేళ్ల‌ల్లో ఇంత త‌క్కువ పాస్ ప‌ర్సంటేజ్ ఎప్పుడూ రాలేదు. గ‌తేడాది కంటే ఈ సారి 11 శాతం మంది స్టూడెంట్లు ఫెయిల్ అవ‌డం కొంత ఆందోళ‌న చెందాల్సిన అంశంమే. వీరికి స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యంలో ఇంట‌ర్ బోర్డు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయలేదు. ఇందులో ఫెయిల్ అయిన విద్యార్థులు డైరెక్ట్‌గా మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించే యాన్యువ‌ల్ ప‌రీక్ష‌ల స‌మ‌యంలోనే రాయాల్సి ఉంటుంది. ఈ స్టూడెంట్లు ఇప్ప‌టికే రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నారు కాబ‌ట్టి.. ఇటు సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు, అటు ఫ‌స్టియ‌ర్ ఫెయిల్ అయిన స‌బ్జెక్టుల‌కు ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది.ఇంట‌ర్ ఫ‌లితాల‌ను చూసి స్టూడెంట్ల త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన కొన్నేళ్ల‌లో ఇలాంటి ఫ‌లితాలను ఎక్క‌డా చూడ‌లేద‌ని చెప్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios