అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రధాని అవమానిస్తుంటే.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతాడంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కామెంట్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జనగామ ప్రసంగం తర్వాత కేసీఆర్ ఖేల్ ఖతమన్న విషయం అర్ధమైపోయిందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.
జనగామలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సభపై స్పందించారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన మోడీని ప్రశ్నించడానికి అంత భయమెందుకు అని నిలదీశారు. అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రధాని అవమానిస్తుంటే.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతాడంటూ కామెంట్ చేశారు రేవంత్. జనగామ ప్రసంగం తర్వాత కేసీఆర్ ఖేల్ ఖతమన్న విషయం అర్ధమైపోయిందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.
అంతకుముందు జనగామలో కేసీఆర్ (kcr) మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడ్డానికి సిద్ధమని.. సిద్ధిపేట వాళ్లు పంపిస్తే తెలంగాణ సాధించామని అన్నారు. జనగామ జరిగిన టీఆర్ఎస్ (trs) బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్ధలు కొడతామని.. ఖబడ్దార్ మోడీ అంటూ సీఎం హెచ్చరించారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. దేశం నుంచి నిన్ను తరిమేస్తామని.. మాకిచ్చే వాళ్లని తెచ్చుకుంటామని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మా జోలికి వస్తే నాశనం చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ (narendra modi) జాగ్రత్త.. నీ ఊడుత ఊపులకు భయపడమన్నారు.
నీళ్ల కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కొట్లాడుతుంటాడని అన్నారు కేసీఆర్. జనగామలో మంచినీళ్ల బాధ.. కరెంట్ బాధ పోయిందని కేసీఆర్ గుర్తుచేశారు. జనగామ జిల్లాకు ఖచ్చితంగా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని.. త్వరలోనే జీవో విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు, స్టెబిలైజర్లు మాయమయ్యాయని.. గతంలో బచ్చనన్నపేట చూస్తేప బాధగా అనిపించేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక బచ్చన్నపేట బతుకు మారిందన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని.. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తున్నామని.. ఏడాదికి రెండు మూడు లక్షల చొప్పున ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలోని 2 వేల కుటుంబాలకు దళిత బంధు అందుతుందని సీఎం హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్లలో ఏనాడు కేంద్రంతో పంచాయతీ పెట్టుకోలేదని కేసీఆర్ గుర్తుచేశారు. అక్కడి నుంచి ఏం రాకున్నా వున్నంతలో అవినీతిరహితంగా ఒక పద్ధతిగా వెళ్తున్నామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇందుకోసం 30 లక్షల బోర్లు వేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. కరెంట్ సంస్కరణల పేరుతో నరేంద్ర మోడీ పంచాయతీ పెడుతున్నారని సీఎం ఆరోపించారు. అడ్డగోలుగా గ్యాస్, డీజిల్, ఎరువుల ధరలు పెంచారని ఆయన మండిపడ్డారు. నరేంద్ర మోడీ పొలాల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారని.. నన్ను చంపినా మీటర్లు పెట్టానని చెప్పానని కేసీఆర్ స్పష్టం చేశారు.
రైతుల ఆదాయం కాదు, పెట్టుబడి డబుల్ అయ్యిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీటర్లు పెట్టాలన్నారని.. అలా చెప్పే చంద్రబాబు వెళ్లిపోయాడని కేసీఆర్ చురకలు వేశారు. మోడీ రైతుల వెంట, పేదల వెంట పడ్డారని.. లక్షల కోట్లు కొల్లగొట్టిన వాళ్లకి టికెట్లు ఇచ్చి విదేశాలకు పంపించాడంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వరని.. కేంద్రం ఇవ్వాల్సినవి ఏవీ ఇవ్వట్లేదని కేసీఆర్ ఆరోపించారు.
