సారాంశం

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గాక బీజేపీ అభ్యర్ధిని గెలిపించారని వ్యాఖ్యానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మూడేళ్లయినా ఇప్పటికీ దుబ్బాక సమస్యలు తీరలేదని.. ఈ ఎన్నికల్లో రఘునందన్‌కు ఓటు అడిగే హక్కు లేదని ఆయన చురకలంటించారు.

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గాక బీజేపీ అభ్యర్ధిని గెలిపించారని వ్యాఖ్యానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర నిధులు రప్పించి దుబ్బాకను అభివృద్ధి చేస్తామన్నారని దుయ్యబట్టారు. కేంద్ర సహకారంతో పారిశ్రామికవాడ, ప్రాజెక్ట్‌లు తెస్తామన్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మూడేళ్లయినా ఇప్పటికీ దుబ్బాక సమస్యలు తీరలేదని.. ఈ ఎన్నికల్లో రఘునందన్‌కు ఓటు అడిగే హక్కు లేదని ఆయన చురకలంటించారు. దుబ్బాక ప్రజల ఆత్మగౌరవం నిలిపే ప్రయత్నం చేయలేదని..దుబ్బాకకు నిధులు రద్దు చేసి సిద్ధిపేటకు తరలిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ వున్న భూములను కేసీఆర్ ఆక్రమించారని ఆయన వ్యాఖ్యానించారు. 

ALso Read: Telangana Elections 2023: ప్రగతి భవన్‌ను అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తాం: రేవంత్ రెడ్డి

అంతకుముందు ఉదయం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ ప్రజా భవన్‌గా మారుస్తామన్నారు. "ప్రగతి భవన్‌కు అంబేద్కర్‌ ప్రజా భవన్‌గా పేరు మారుస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గేట్లను తొలగిస్తాం. దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ 'ప్రజా భవన్' అని పేరు పెడుతాం. ఇది 24x7 ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డానికి అందుబాటులో తెరిచి ఉంటుంద‌ని" తెలిపారు. 

ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తామ‌నీ, కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని రేవంత్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. అందుకే ఈ విష‌యాన్ని చెబుతున్నామ‌ని పేర్కొన్నారు. ఏ నియోజకవర్గం నుండి అయినా ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించి పరిష్కారాన్ని పొందేందుకు ఎప్పుడైనా ప్రజా భవన్‌లోకి అనుమతించబడతారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 'ప్రగతి భవన్' తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, ప్రధాన కార్యస్థలం, ఇది హైదరాబాద్‌లో ఉంది.