Telangana Elections 2023: ప్రగతి భవన్‌ను అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తాం: రేవంత్ రెడ్డి
TPCC president Revanth Reddy: ఏ నియోజకవర్గం నుండి అయినా ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించి పరిష్కారాన్ని పొందేందుకు ఎప్పుడైనా ప్రజా భవన్‌లోకి అనుమతించబడతారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. "ప్రగతి భవన్‌కు అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు మారుస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గేట్లను తొలగిస్తాం. దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ 'ప్రజా భవన్' అని పేరు పెడుతాం. ఇది 24x7 ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అందుబాటులో తెరిచి ఉంటుందని" తెలిపారు.
ఎన్నికల్లో జయకేతనం ఎగురవేస్తామనీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయాన్ని చెబుతున్నామని పేర్కొన్నారు. ఏ నియోజకవర్గం నుండి అయినా ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించి పరిష్కారాన్ని పొందేందుకు ఎప్పుడైనా ప్రజా భవన్‌లోకి అనుమతించబడతారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 'ప్రగతి భవన్' తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, ప్రధాన కార్యస్థలం, ఇది హైదరాబాద్‌లో ఉంది.
తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. 2018లో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా పిలువబడే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మొత్తం 119 సీట్లలో 88 సీట్లను గెలుచుకుంది, మొత్తం ఓట్ల షేర్‌లో 47.4 శాతం సాధించింది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.