కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవసాయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్:కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలనుకొంటే తాను ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.వరి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు.సీఎం కేసీఆర్ వేల కోట్లను కాంట్రాక్టర్లకు కట్టబెట్టారన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి వెనుకాడనని చెబుతున్నారన్నారు. టీఆర్ఎస్ మహాధర్నాలో కేసీఆర్ రైతుల గురించి మాట్లాడలేదన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయాలనుకొంటే కళ్లాల వద్దకు సీఎం వెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు.కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల తరపున పోరాటం చేసే విషయమై కార్యాచరణను ఎందుకు ప్రకటించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ఆయన కోరారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ రాళ్ల దాడి జరిగిందని చెబుతున్నారన్నారు. Bandi Sanjay పర్యటనలో రాళ్లదాడి వీధి నాటకమేనని ఆయన అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ లు నువ్వు కొనాలంటే నువ్వు కొనాలని డ్రామాలు ఆడుతున్నారన్నారు.
తాను కేసులకు భయపడనని కేసీఆర్ చెబుతున్నారు.. మరోవైపు కేసీఆర్ అవినీతి చిట్టాను బయట పెడుతామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని Revanth Reddy గుర్తు చేశారు. ఈ కేసుల్లో కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని బీజేపీ నేతలు చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. సహారా కుంభకోణంలో ఏడేళ్లుగా ఛార్జీషీటు ఎందుకు దాఖలు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. kcr అవినీతిపై చర్యలు తీసుకొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారని కానీ ఈ విషయమై తాను ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆయన బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.
also read:వరిపై కేసీఆర్ పోరు: గవర్నర్‌తో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల భేటీ
వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధానికి సిద్దమైంది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహా ధర్నా నిర్వహింంచింది. ఈ ధర్నా పూర్తైన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. పంట మార్పిడి అనివార్యమని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు. ఇదే అంశాన్ని చేసుకొని రాజకీయంగా పై చేయి సాధించేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.హుజూరాబాద్ ఉప ఎన్నికల పలితాల తర్వాతే కేసీఆర్ ఈ అంశాన్ని తెర మీదికి తీసుకు రావడాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.ఈ ఉప ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే కేసీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
