Asianet News TeluguAsianet News Telugu

వరిపై కేసీఆర్ పోరు: గవర్నర్‌‌తో టీఆర్ఎస్‌ ప్రజా ప్రతినిధుల భేటీ

వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తీసుకొని తెలంగాణ సీఎం కేసీఆర్  నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా గురువారం నాడు హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ దర్నా తర్వాత టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా రాజ్‌భవన్ కు చేరుకొన్నారు. గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం సమర్పించారు.

Trs Elected representatives meeting with Governor Tamilisai soundararajan
Author
Hyères, First Published Nov 18, 2021, 2:44 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన వైఖరిని తెలపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం గురువారం నాడు గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన paddy ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి  స్పష్టమైన వైఖరిని తెలపాలని trs సర్కార్ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో గురువారం నాడు  ఉదయం హైద్రాబాద్  ఇందిరాపార్క్  వద్ద టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మహా ధర్నా నిర్వహించారు.

also read:KCR: అవసరమనుకుంటే భారత రైతాంగ సమస్యలపై టీఆర్‌ఎస్ లీడర్ షిప్ తీసుకుంటుంది.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్

తెలంగాణ సీఎం kcr సహా ఆయన మంత్రివర్గ సహచరులు టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులంతా  ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇందిరాపార్క్‌లో ధర్నా ముగించుకొన్న టీఆర్ఎష్ బృందం నేరుగా రాజ్‌భవన్ కు చేరుకొంది. ప్రత్యేకమైన బస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ కు చేరుకొన్నారు. ధర్నా తర్వాత ఈ విషయమై గవర్నర్ కు  టీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది.

కేంద్రం మడతపేచీ పెడుతుంది: మంత్రి నిరంజన్ రెడ్డి


మహా ధర్నాలో సీఎం  కేసీఆర్ ప్రస్తావించిన అంశాలను గవర్నర్ కు వివరించినట్టుగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. గవర్నర్ ను కలిసిన తర్వాత ఆయన రాజ్‌భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.ఉత్తర భారతంలో వేసవిలో వరిని పండించరని ఆయన గుర్తు చేశారు. నిన్నటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి గుర్తు చేశారు. కేంద్రం కొనుగోలు చేసే ధాన్యం సరిపోదని గవర్నర్ కు వివరించినట్టుగా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

రైతుల అంశంలో అనవసర గందరగోళం వద్దని గవర్నర్ కు చెప్పామన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో  కొనుగోలు చేసిన ధాన్యంలో మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.ఒక ఏడాదిలో తెలంగాణ నుండి కేంద్రం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తోందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మడత పెట్టి మాట్లాడుతుందన్నారు.ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులకు తాము దిశ నిర్ధేశం చేస్తామన్నారు.రాష్ట్రంలో రైతుల పరిస్థితిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించినట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా గవర్నర్ తమిళిసై  తమకు హామీ ఇచ్చారని మంత్రి వివరించారు.

వరి ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఇదే విషయమై రెండు పార్టీలు పరస్పరం పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ ధర్నా తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే రెండు మూడు రోజలు తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios