Asianet News TeluguAsianet News Telugu

ధరణి పోర్టల్ కేటీఆర్ మిత్రుడి కనుసన్నల్లోనే.. మన వివరాలన్ని విదేశీ వ్యక్తుల గుప్పిట్లో : రేవంత్ వ్యాఖ్యలు

ధరణి పోర్టల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి వ్యవహారాలన్నీ కేటీఆర్ మిత్రుడి కనుసన్నల్లోనే సాగుతున్నాయని.. భూములను పెద్ద ఎత్తున కాజేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

tpcc chief revanth reddy sensational comments on dharani portal ksp
Author
First Published Jul 6, 2023, 3:37 PM IST

ధరణి పోర్టల్ వెనుక గుడుపుఠానీ వుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ సన్నిహితుడు శ్రీధర్ చేతుల్లో వుందన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. లక్షలాది ఎకరాల భూములను కాజేసి వాటిని లేఔట్లుగా వేసి అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ , ప్రైవేట్ భూములు, ఆధార్ , పాన్ , బ్యాంక్ ఖాతాల వివరాలు విదేశీ వ్యక్తుల చేతుల్లో వున్నాయని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ధరణి పోర్టల్‌కు సంబంధించి సీనియర్ నేత కోదండ రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు సేకరించిందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 1500 ఎకరాల భూమిని కాజేశారని. కర్ణాటకలో తన్ని తరిమేసిన అమూల్ డైరీకి వందల ఎకరాలు కట్టబెట్టారని రేవంత్ మండిపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ కంపెనీకి కూడా భూములు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో దేవాదాయ శాఖ భూములను ఫార్మా కంపెనీకి అప్పగిస్తే హైకోర్ట్ స్టే విధించిందని ఆయన గుర్తుచేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios