Asianet News TeluguAsianet News Telugu

118 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలి: ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి

118 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు వస్తేనే దళితబంధు పథకం అమలుకానుందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.  సోమవారం నాడు ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభను నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 

TPCC Chief Revanth Reddy sensational comments on Dalit bandhu scheme lns
Author
Hyderabad, First Published Aug 9, 2021, 6:46 PM IST

ఆదిలాబాద్:తెలంగాణలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తేనే దళితులు,గిరిజనులకు దళితబంధు అమలు కానుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభను నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 

ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు దళిత, గిరిజనులు గుర్తుకు వస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ. 10 లక్షలు ఇస్తారో చస్తారో తేల్చుకోవాలన్నారు. హుజూరాబాద్‌ లోని దళితులకు రూ. 10 లక్షలు ఇస్తే రాష్ట్రంలోని ఇతర  దళితులు, గిరిజనులకు ఈ పథకం వర్తించదా ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ సీఎం పదవిని చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజల తలలపై లక్ష రూపాయాలు అప్పు మోపారని ఆయన విమర్శించారు. 

also read:కాంగ్రెస్ జెండా మోసేవారికే న్యాయం, కార్యకర్తల పార్టీ: ఇంద్రవెల్లిలో రేవంత్

రాష్ట్రంలోని పేదలు బతకడానికి కనీసం ఉద్యోగం ఇవ్వవా అని ఆయన ప్రశ్నించారు. ఇన్ని వేల కోట్ల రూపాయాలు అప్పు తెచ్చి కూడ దళితులు, గిరిజనులకు చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు.ఇంద్రవెల్లి సభకు లక్షకు ఒక్కరు తక్కువ ఉన్నా కూడ తలవంచుతా అని ఆయన తేల్చి చెప్పారు. లక్ష మందితో కేసీఆర్ సర్కార్ పై దండు కడుతానన్నారు. ఊట్నూరులో 10 వేలమందిని పోలీసులు ఆపడం న్యాయమా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఈ సభకు జనాన్ని రాకుండా అడ్డుకొంటారా అని ఆయన అడిగారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios