Asianet News TeluguAsianet News Telugu

పాత కాంగ్రెస్ నేతలపై రేవంత్ ఫోకస్: కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ.. ఏం జరుగుతోంది..?

కొండాతో రేవంత్‌రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.  

tpcc chief revanth reddy meets ex mp konda vishweshwar reddy ksp
Author
hyderabad, First Published Jul 13, 2021, 7:47 PM IST

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నేతలతో పాటు గతంలో పార్టీని వీడిన వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నేతలు తమతో టచ్‌లో వున్నారని రేవంత్ రెడ్డి మీడియాతో అన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని రేవంత్‌ కలిశారు. మంగళవారం కొండా నివాసానికి వెళ్లిన పీసీసీ చీఫ్ తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చిస్తున్నారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీని వీడిన తర్వాత ఆయన పలు పార్టీల నేతలతో భేటీ అయినప్పటికీ ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు.

Also Read:షాక్: కాంగ్రెస్‌లోకి ఎర్రశేఖర్, డిఎస్ తనయుడు కూడా

అప్పట్లో ఈటల బీజేపీలో చేరే సమయంలో కొండా కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం నడిచింది. కానీ విశ్వేశ్వర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కొండాతో రేవంత్‌రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios