Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు నేతలతో నేడు కూడా రేవంత్ భేటీ: ప్రచార వ్యూహంపై చర్చ


మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంతో పాటు నేతల సమన్వయంపై రేవంత్ రెడ్డి చర్చించారు. 

TPCC Chief Revanth Reddy meeting With Munugode Congress leaders
Author
First Published Sep 11, 2022, 5:14 PM IST


హైదరాబాద్:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం కూడా మునుగోడు నియోజకవర్గానికి చెందిన నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి బరిలోకి  దిగనుంది. రెండు రోజుల క్రితమే పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.  కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్న కైలాస్ తదిరులతో రేవంత్ రెడ్డి నిన్నసమావేశమయ్యారు ఈ సమావేశానికి కొనసాగింపుగానే ఇవాళ మరో సారి కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ నెల 18వ తేదీ నుండి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. 

అభ్యర్ధి ఎంపిక విషయంలో ప్రామాణికంగా తీసుకున్న అంశాలను రేవంత్ రెడ్డి నేతలకు వివరించారు. ఏ పరిస్థితుల్లో ఇతర అభ్యర్ధుల అభ్యర్ధిత్వాలను పక్కన పెట్టాల్సి వచ్చిందో వివరించారు.  ఈ స్థానం నుండి పోటీకి పాల్వాయి స్రవంతితో పాటు మరో ముగ్గురు నేతలు పోటీ పడ్డారు.కొత్తవారికి పార్టీ టికెట్ కేటాయించడం కంటే పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి టికెట్ కేటాయించాలని పార్టీ సీనియర్లు  నాయకత్వానికి సూచించారు.  గత మాసంలో రాష్ట్రానికి వచ్చిన పార్టీ ఇంచార్జులతో ఇదే విషయాన్ని పార్టీ నేతలు చెప్పారు. దివంగత మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురే పాల్వాయి స్రవంతి . పార్టీ అగ్ర నేతల వద్ద నలుగురు తమ వాదనలను వినించారు.. చివరకు పాల్వాయి స్రవంతి వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది.

2018 ఎన్నికల సమయంలో కూడా తనకు టికెట్ ఇవ్వాలని స్రవంతి కోరారు. కానీ ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. 2014 ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ ఓటమి పాలైంది. పాల్వాయి స్రవంతిపైనే టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

గత నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఆగష్టు 21న మునుగోడులో నిర్వహించిన సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.

also read:అందరినీ సంప్రదించాకే మునుగోడు అభ్యర్ధి ఎంపిక.. త్వరలోనే ప్రచార రంగంలోకి : రేవంత్ రెడ్డి

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఆరు మాసాల్లోపుగా ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.  మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి స్రవంతి,. బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దింపుతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ర ప్రభాకర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తుంది.కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని వ్యతిరేకం వర్గం డిమాండ్ చేసిన నేపథ్యంలో అసంతృప్త్తులను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు మంత్రి జగదీష్ రెడ్డి.  కేసీఆర్ తో సమావేశం ముగిసిన తర్వాత కూడ అసంతృప్తివాదులు మరోసారి సమావేశమై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ అగ్ర నేతలు రంగంలోకి దిగి అసంతృప్తివాదులతో చర్చించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios