Asianet News TeluguAsianet News Telugu

రంగారెడ్డి తిమ్మపూర్‌లో రూ. 1000 కోట్ల భూ కుంభకోణం: రేవంత్ రెడ్డి

ధరణి పోర్టల్ ద్వారా  నిషేధిత  భూముల  రిజిస్ట్రేషన్లు   చేస్తున్నారని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

TPCC Chief Revanth Reddy Demands To Take Action Against Rules Violate officers in Rangareddy District Land Scam lns
Author
First Published Jun 12, 2023, 4:57 PM IST

హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా  నిషేధిత జాబితాలో  భూములను  అక్రమంగా రిజిస్ట్రేషన్  చేస్తున్నారని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఆరోపించారు.సోమవారంనాడు  గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ పై  సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు  రేవంత్ రెడ్డి  కౌంటరిచ్చారు. ధరణి ద్వారా భూదాన్ భూముల అమ్మకం, కొనుగోళ్లు జరుగుతున్నాయని  రేవంత్ రెడ్డి  చెప్పారు. నిషేధిత  భూములన్నీ  ధరణి సహాయంతో  కేసీఆర్ అనుచరులకు  వెళ్లాయని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు. 

ప్రజలకు  ఉపయోగపడేందుకు  ధరణిని  రద్దు  చేస్తామని  తాము చెబుతున్నందుకే  కేసీఆర్ పెడబొబ్బలు పెడుతున్నాడని  రేవంత్ రెడ్డి  విమర్శించారు. టెక్నాలజీ సహాయంతో  ప్రజలకు  ఉపయోగపడే  నూతన  విధానం తీసుకువస్తామని రేవంత్ రెడ్డి  చెప్పారు.  ధరణి పోర్టల్ వల్ల  20 లక్షల మంది  బాధితులున్నారని  రేవంత్ రెడ్డి  తెలిపారు.  ధరణి రద్దు చేస్తే  రైతు బంధు,  రైతు భీమా  రాదని  కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని  రేవంత్ రెడ్డి చెప్పారు. 

జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వామ్యులకు  వ్యతిరేకంగా  తెలంగాణలో  ఉద్యమాలు  వచ్చిన విషయాన్ని
రేవంత్ రెడ్డి గుర్తు  చేశారు. ఈ పోరాటా ల కారణంగానే  కేంద్ర ప్రభుత్వం  సీలింగ్ యాక్ట్ తెచ్చిందన్నారు.   కుటుంబానికి  54 ఎకరాలకు  మించి భూమి ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం  చట్టం తెచ్చిన విషయాన్ని ఆయన  ప్రస్తావించారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం  వేల మందికి భూములను  పంచి పెట్టిందన్నారు. మండల వ్యవస్థ  వచ్చాక  భూ రికార్డులన్నీ  మండలాలకు  బదిలీ అయ్యాయన్నారు.భూ హక్కుల కోసమే  తెలంగాణ ప్రజలు  సాయుధ  పోరాటం  చేశారని  ఆయన గుర్తు చేశారు.  సమస్యలు  ఉన్నంతవరకు  ప్రజా పోరాటాలుంటాయని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  భూస్వాములపై  తిరుగుబాటు  కోసమే నక్సల్ బరి ఉద్యమాలు  వచ్చాయని  రేవంత్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం  భూములువివరాలను  పారదర్శకంగా  రికార్డు  చేసిందన్నారు. భూముల వివరాలను  డిజిటలైజ్ చేసేందుకు భూ భారతి  పేరుతో నిజామాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు ను నిర్వహించిన  విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. రంగారెడ్డి జిల్లాలో  15 వేల ఎకరాల భూదాన్ భూములున్నాయని రేవంత్ రెడ్డి  చెప్పారు. భూదాన్ భూములన్నీ కూడా  అసైన్డ్ భూములేనన్నారు. 


తిమ్మూపూర్ లో రూ. 1000 కోట్ల భూ కుంభకోణం

రంగారెడ్డి  జిల్లాలోని కందుకూరు మండలం  తిమ్మూపూర్ గ్రామంలో  146 ఎకరాల నిషేధిత భూమి విక్రయించారన్నారు. ఈ భూమిని  విక్రయించొద్దని  ఆదేశాలు ఉన్నా కూడ భూ  విక్రయం ఎలా జరిగిందని  ఆయన  ప్రశ్నించారు.  ఇందుకు బాధ్యులైన వారిపై  చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి   డిమాండ్  చేశారు.  ఈ భూ కుంభకోణం వెనుక  బీఆర్ఎస్ నేతల హస్తం  ఉందని ఆయన  ఆరోపించారు. 

నిషేధిత భూముల క్రయ విక్రయాలు జరిపిన  కలెక్టర్,  ఎమ్మార్వో , సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు. మరో వైపు  కలెక్టర్ పై  డీఓపీటీ, విజిలెన్ కు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఎందకు  ఫిర్యాదు చేయడం లేదని ఆయన  ప్రశ్నించారు. ఈ భూముల విషయమై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  లేఖ రాసిన  విషయాన్ని  రేవంత్ రెడ్డి  గుర్తు  చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios