నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటిషియన్: కేసీఆర్ పై రేవంత్ ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్  అమలు చేయలేదని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.

TPCC Chief Revanth Reddy  demands KCR  To bring  All party delegates to Medigadda lns

హైదరాబాద్:నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్  కేసీఆర్ అని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.శుక్రవారంనాడు  హైద్రాబాద్ లో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి   మీట్ ది ప్రెస్  కార్యక్రమంలో  పాల్గొన్నారు. తెలంగాణ ఒక్క వ్యక్తి ఉక్కు పాదాల కింద నలిగిపోతుందని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణ ప్రజల ప్రజల పోరాటంలో  న్యాయం, ధర్మం ఉందని కాంగ్రెస్ నమ్మిందని  ఆయన చెప్పారు. అందుకే  సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిందన్నారు.ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంలో సోనియా కీలకంగా వ్యవహరించారని  రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక  స్థానం ఉందన్నారు.

 రాష్ట్ర చిహ్నంలోనే రాచరిక పోకడల గుర్తులు కన్పిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తుండాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ కోసం ఎందరో యువకులు  ప్రాణ త్యాగం చేశారని  రేవంత్ రెడ్డి  గుర్తు చేశారు.

ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో చెప్పారు... ఏం జరిగిందో ఆలోచించాలని రేవంత్ రెడ్డి  ప్రజలను కోరారు.పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయా అని ప్రజలు ఆలోచించాలన్నారు.పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయా అని ప్రజలు ఆలోచించాలన్నారు.

ప్రజల ప్రాథమిక హక్కులను ఈ పదేళ్లలో కేసీఆర్ కాలరాశారన్నారు. ఎన్నుకున్నప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా కేసీఆర్ పాలన ఉందని  ఆయన విమర్శించారు.నిరసనలు తెలపడం  ప్రజల ప్రాథమిక హక్కు అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాథమిక హక్కును కూడ కేసీఆర్ కాలరాశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

సమైక్య పాలనలో   నీళ్లు, నిధులు,నియామకాల విషయంలో  ఇబ్బంది పెట్టారన్నారు.స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని  ప్రజలు  కోరుకుంటున్నారన్నారు. బంగారు తెలంగాణ ఫలాలు ఎవరికి అందుతున్నాయని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ పాలన గురించి  యువత, రైతులు, మహిళలు చెబుతున్నారన్నారు.

పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్‌సీ విఫలమైందని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. మందు,పైసలు పంచొద్దని  తాను  చేసిన సవాల్ ను స్వీకరించాలని  రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను కోరారు.

మేడిగడ్డ  పిల్లర్  మూడు అడుగులు కుంగిపోయిందన్నారు. పిల్లర్ అడుగున ఇసుక ఉందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు తెలియదా అని  ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ పాపాలు పండినందునే  మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని  రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు  అఖిలపక్షాన్ని తీసుకెళ్దాం  రెడీనా అని  రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.  ఓటుకు రేటు పెంచి విలువ కట్టినవాడే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios