Asianet News TeluguAsianet News Telugu

ఏమైనా అంటే కోర్టుకు పోతాడు.. పిరికోళ్ల గురించి ఏం మాట్లాడతాం : కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr) , టీపీసీసీ చీఫ్ (tppc)  రేవంత్ రెడ్డి (revanth reddy) మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా కేటీఆర్ తనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రేవంత్. 

tpcc chief revanth reddy counter to minister ktr
Author
Hyderabad, First Published Oct 19, 2021, 3:36 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr) , టీపీసీసీ చీఫ్ (tppc)  రేవంత్ రెడ్డి (revanth reddy) మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా కేటీఆర్ తనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రేవంత్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితులను సీఎం చేయండి అని దళితులు అడగలేదని దుయ్యబట్టారు. ఖాతాలో డబ్బులు వేశాంకానీ.. ఇప్పుడు రావంటున్నారని.. పెళ్లిపత్రిక రాయకుండా ఎవరైనా పెళ్లి చేస్తారా అని రేవంత్ సెటైర్లు వేశారు. బీసీలపై దళితులను ఊసిగొలిపే చర్యలకు సీఎం కేసీఆర్ దిగుతున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌కు సిగ్గు వుండాలని.. ఏం ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. బరితెగించిన కోడి.. బజార్లో వచ్చి గుడ్డు పెట్టిందన్నట్లు కేటీఆర్ వ్యవహారం వుందని రేవంత్ సెటైర్లు వేశారు. 

తాను ఏదైనా అంటే కేటీఆర్ కోర్టుకు వెళ్తున్నాడని.. పిరికివాళ్ల గురించి ఏం మాట్లాడతామంటూ ఆయన ఎద్దేవా చేశారు. లింగోజీగూడలో (lingojiguda bypoll) బీజేపీ (bjp), టీఆర్ఎస్ (trs) కలిసివచ్చినా మూసీలో తొక్కుతామని రేవంత్ స్పష్టం చేశారు. భట్టిగా (bhatti vikramarka) తోడుగా కేటీఆర్‌ను రావాలని.. వచ్చి కూర్చొని మాట్లాడితే తెలుస్తుందని చెప్పారు. తమ పార్టీలో సీనియర్ల గురించి చెప్పడానికి వీరెవరంటూ రేవంత్ ఫైరయ్యారు. నవంబర్ 15 లోపు కేటీఆర్ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 2008లో టీఆర్ఎస్ 16 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల ఓడిపోయారని.. 4 చోట్ల పోటీ చేస్తే రెండు ఓడిపోయారని రేవంత్ గుర్తుచేశారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వచ్చారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తండ్రి సంపాదించినది చూసుకుని కేటీఆర్ మొరుగుతున్నాడని రేవంత్ మండిపడ్డారు. అయ్యాకొడుకులకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. 

ALso Read:ఈ సన్నాసి రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు... మరి ఏమయ్యింది: రేవంత్ పై కేటీఆర్ ఫైర్

అంతకుముందు హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) గురించి స్పందిస్తూ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ పై (etela rajender) విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. వీరిద్దరు కుమ్మక్కయ్యారని... అందువల్లే హుజురాబాద్ లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదన్నారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న ఇదే సన్నాసి చేయలేదంటూ కేటీఆర్ ఫైరయ్యారు. కాంగ్రెస్ లో భట్టిది నడవడం లేదని.. గట్టి అక్రమార్కులది నడుస్తోందని ఆరోపించారు. దళిత బంధు ను కొన్ని రోజులు ఆపగలరేమో.. నవంబర్ 3 తర్వాత ఆపగలుగుతారా? కేసీఆర్ (kcr) జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం సమయం సందర్భాన్ని ఉంటుందని కేటీఆర్ తెలిపారు. తాను వేరే వారి లాగా చిలుక జోస్యం చెప్ప లేనన్నారు.  ఉద్యమ కారులు అసంతృప్తిగా ఉంటే ఇన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios