Asianet News TeluguAsianet News Telugu

ఈ సన్నాసి రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు... మరి ఏమయ్యింది: రేవంత్ పై కేటీఆర్ ఫైర్

హుజురాబాద్ ఉపఎన్నిక గురించి స్పందిస్తూ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ పై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీరిద్దరు కుమ్మక్కయ్యారని... అందువల్లే హుజురాబాద్ లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదన్నారు. 

trs working president KTR Fires on revanth reddy and eatala rajender
Author
Hyderabad, First Published Oct 19, 2021, 11:46 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ వందకు వంద శాతం విజయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. నాగార్జున సాగర్ లో జానా రెడ్డినే ఓడించాం... ఈటల రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా? అన్నారు. eatala rajender బీజేపీ బురదను అంటించుకున్నారని పేర్కొన్నారు. BJP ని ఈటల... ఈటలను బీజేపీ సొంతం చేసుకోవడం లేదన్నారు. జై ఈటల అంటున్నారు తప్ప జై శ్రీరామ్ అని ఎందుకనడం లేదు...Huzurabad bypoll లో బీజేపీ అంటే ఓట్లు పడవనే ఈటల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదన్నారు. 

''ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ ఎంతో చేసింది. అలాంటి పార్టీకి రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పడం లేదు. గెలిస్తే ఏం చేస్తాడో చెప్పక వేరే విషయాలు మాట్లాడుతున్నాడు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి. ఈటల, రేవంత్ కుమ్మక్కయ్యారు. అందుకోసమే బలమైన అభ్యర్థిని కావాలనే కాంగ్రెస్ బరిలోకి దింపలేదు'' అన్నారు కేటీఆర్. 

''హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు కానీ Revanth reddy ముందస్తు ఎన్నికల  గురించి చిలక జోస్యం చెబుతున్నాడు. TPCC అధ్యక్షుడు అయ్యాక తనను తాను నిరూపించుకోవాలి కదా... అలాంటిది రేవంత్ ఎందుకు హుజురాబాద్ వెళ్లడం లేదు'' అని నిలదీసారు. 

''అంతకుముందు కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న ఇదే సన్నాసి చేయలేదు. తాను గెలిస్తే కెసీఆర్ అసెంబ్లీకి రావద్దని రాజేందర్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత గెలిస్తే ప్రధాని మోడీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడా. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే'' అన్నారు. 

read more  హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేత రాజకీయ కుట్ర: మంత్రి కొప్పుల ఈశ్వర్

''కాంగ్రెస్ లో భట్టిది నడవడం లేదు. గట్టి అక్రమార్కులది నడుస్తోంది. దళిత బంధు ను కొన్ని రోజులు ఆపగలరేమో.. నవంబర్ 3 తర్వాత ఆపగలుగుతారా? కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం సమయం సందర్భాన్ని ఉంటుంది. నేను వేరే వారి లాగా చిలుక జోస్యం చెప్ప లేను. ఉద్యమ కారులు అసంతృప్తిగా ఉంటే ఇన్ని ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఎందుకు గెలుస్తుంది. ప్రజా ఆలోచనకు హుజురాబాద్ ఉప ఎన్నిక కచ్చితంగా ప్రతిబింబమే'' అన్నారు కేటీఆర్. 

''నేను హుజురాబాద్ ప్రచారానికి వెళ్లడం లేదు. నాగార్జున సాగర్, దుబ్బాక కు కూడా వెళ్ళలేదు. హుజురాబాద్ లో సీఎం ప్రచారం కూడా ఇంకా ఖరారు కాలేదు. రేవంత్, ఈటల తదితరులు టీఆర్ఎస్ పై కుట్ర కు తెరలేపారు. ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈటలకు ఓటెయ్యాలని లేఖ రాయడం ఏమిటి? హుజురాబాద్ కచ్చితంగా చిన్న ఎన్నికే'' అన్నారు. 

''టీఆర్ఎస్ విజయాలు మీడియా కు కనిపించవు. ప్రాంతీయ పార్టీ లు ఇరవయ్యేళ్లు మనగలడం గొప్ప విషయం. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ లే ముందుకు సాగుతున్నాయి. కేసీఆర్ ఎంతో మంది లీడర్లను తయారు చేశారు'' అని కేటీఆర్ పేర్కొన్నారు. 

read more  దళితబంధు: నాలుగు మండలాలకు రూ. 250 కోట్ల నిధులు విడుదల

''నవంబర్ 15 తర్వాత నాతో పాటు కొంత మంది టీఆర్ఎస్ నేతలు తమిళనాడు వెళ్తున్నాం. aidmk, dmk పార్టీల సంస్థాగత నిర్మాణం పరిశీలిస్తాం. పార్టీ లో ఎన్నో దారులు ఉంటాయి. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది భిన్న దారుల్లో పోరాడి చివరకు కాంగ్రెస్ లో చేరలేదా. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది'' అన్నారు. 

''కేసీఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం. వివిధ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు వున్నాయనడం పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శనం. అన్నిటిని అధిగమిస్తాం. నియోజకవర్గ నేతలతో జరుగుతున్న మీటింగుల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను కేసీఆర్ కు తెలియజేస్తా'' అని కేటీఆర్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios