కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మా వాడే: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరణ
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ కాదు, బ్రాండీ షాప్ పెట్టుకొనే వాళ్లంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని వెంకట్ రెడ్డి చెప్పారు.ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
హైదరాబాద్: భువనగిరి ఎంపీ komatireddy Vankat Reddy పై తాను ఎలంటి వ్యాఖ్యలు చేయలేదని TPCC చీఫ్ Revanth Reddyతేల్చి చెప్పారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ బ్రాండ్ కాదు బ్రాండీ షాప్ పెట్టుకొనే వాళ్లంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై Bhuvanagiri MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాదు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ వ్యాఖ్యలపైటీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు వివరణ ఇచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధం లేదన్నారు. komatireddy Rajagopal Reddy వేరు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేరని రేవంత్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయనర్ అని ఆయన చెప్పారు. పార్టీలో తన కంటే సీనియర్ అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం వెంకట్ రెడ్డి నిరంతరం పనిచేస్తారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయం వైపునకు తీసుకెళ్లేందుకు గాను వెంకట్ రెడ్డి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని కూడ త్యాగం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మనస్థాపం చెందవద్దనన్నారు.
also read:ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: బీజేపీ అగ్రనేతలతో భేటీ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాండ్ Congress ఇచ్చిందేనని రేవంత్ రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తనకు మధ్య అగాధం సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మా వాడేనన్నారు. తెలంగాణకు BJP ద్రోహం చేసిందన్నారు. కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, TRS నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ముగిసిన తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరానని చెప్పారు.
ఈ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ విషయమై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేయకుండా తనను కూడా కలిపి విమర్శలు చేయడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు.ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని కూడా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి ఇవాళ వివరణ ఇచ్చారు.