సారాంశం

Revanth reddy: ఓటమి భయంతో సీఎం కేసీఆర్‌ రైతు బంధు నిధులను మళ్లీంచారనీ, ఆ నిధులను ఇతర కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు ఉపయోగించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 

Revanth reddy: తెలంగాణాలో జరిగిన ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో గత రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి కూడా హోరాహోరీగా పోరాటం చేసింది. అయినా ఎగ్జిట్ పోల్ మాత్రం గులాబీ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఈ సారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని అంచనాలు వెల్లడించాయి. ఈ సర్వేలో విశ్వసనీయత ఎంత ఉందో.. ఏ పార్టీ అధికార పగ్గాలను కైవసం చేసుకుంటుందో రిజల్స్ డే వరకు వేచి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖరారు కావడంతో సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో వివాదాస్పద నిర్ణయాలు సంచలన ఆరోపణలు చేశారు. ఓటమి భయంతో కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇందులో బిల్లుల చెల్లింపుతో పాటు ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయని రేవంత్ తెలిపారు. ఇతర కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు రైతు బంధు నిధులను వాడుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహరంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న అసైన్డ్‌ భూములను సీఎం కేసీఆర్ తన అనుచరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేసే  ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ  లావాదేవీలన్నింటిపై విజిలెన్స్‌ విభాగం నిఘా పెట్టాలని కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.