Holiday: ఈ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు.. మరో జిల్లాలో నాలుగు రోజులు సెలవు

మేడారం సమ్మక్క, సారక్క జాతర జోష్ రాష్ట్రమంతా కనిపిస్తున్నది. ముఖ్యంగా వరంగల్, ములుగు జిల్లాల్లో ఈ జాతర హడావుడి స్పష్టంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో రేపు సెలవు ప్రకటించారు. 
 

tomorrow holiday for school, colleges in view of medaram sammakka sarakka jatara kms

Medaram Jatara: రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా మేడారం ముచ్చట్లే. సమ్మక్క సారక్క జాతర గురించే చర్చ. ఎత్తు బంగారాలు, మొక్కలు అప్పజెప్పుడు, తీర్థం పోయి వచ్చుడు, సమ్మక్క సారక్క గద్దెలు.. ప్రధానంగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్న సారలమ్మ గద్దె మీదికి వచ్చింది. ఈ రోజు సమ్మక్క గద్దె మీదికి వస్తున్నది. రాష్ట్రమంతటా ఈ జాతర సందడి ఉన్నది. మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అందులోనూ ములుగు జిల్లాలో ఈ తీర్థం హడావుడి మామూలుగా లేదు. సర్వం సమ్మక్క మయం కావడంతో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే నిర్ణయానికి అధికారులు వచ్చారు.

వరంగల్ జిల్లాలో రేపు అన్ని పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇది కేవలం వరంగల్ ఉమ్మడి జిల్లాకే వర్తిస్తుంది. అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్టు కలెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Also Read : VPR: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి ఎందుకు రాజీనామా చేశారు? ఆయన అడుగులు ఎటువైపు?

ములుగులో నాలుగు రోజులు

మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లా మొత్తం జాతర జోష్‌లో ఉన్నది. ఈ జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు నాలుగు రోజులు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. ఈ నాలుగు రోజులతోపాటు ఐదో రోజు ఆదివారం రావడంతో అదనంతా మరో రోజు సెలవు కలిసి వస్తున్నది. దీంతో స్కూళ్లు, కాలేజీలు ఐదు రోజులు మూసే ఉండనున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios