టెట్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఈ నెల 2 నుంచి మొదలైన ఈ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు హౌజ్‌ఫుల్ అయినట్టు తెలిసింది. దీంతో ఈ పరీక్షా కేంద్రాలకు దరఖాస్తులను స్వీకరించరు. ఈ ఆరు జిల్లాల అభ్యర్థులు నేడు దరఖాస్తు చేస్తే వారు వేరే జిల్లాను ఎగ్జామ్ సెంటర్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 2 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ సాయంత్రానికల్లా సుమారు 2.40 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. అయితే.. ఇప్పటికే ఆరు జిల్లాల్లో టెట్ అభ్యర్థులు రాసే పరీక్షా కేంద్రాలు హౌజ్‌ఫుల్ అయ్యాయి.
టెట్ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రంలో 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య ఆధారంగా కేంద్రాలను కేటాయించనున్నారు. ముందు దరఖాస్తు చేసుకున్నవారికి అభ్యర్థులు కోరుకున్న కేంద్రాలను కేటాయిస్తారు. అయితే.. ఆ పరీక్షా కేంద్రాలు పూర్తిగా నిండితే మాత్రం ఆపై దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేరే పరీక్ష కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటున్నది.
Also Read: గ్రూప్ 4 రిజల్ట్స్ పై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్య
సోమవారం సాయంత్రానికి ఆరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు నిండిపోయాయి. దీంతో ఇప్పుడు ఆ జిల్లాలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వేరే జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాల్సి వస్తున్నది. పరీక్షా కేంద్రాలు నిండిన జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ వంటి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు నిండిపోయాయి. దీంతో ఈ పరీక్షా కేంద్రాలకు దరఖాస్తుల స్వీకరణను నిలిపేశారు. నేడు ఈ జిల్లాల్లో దరఖాస్తులు చేసే వారు అనివార్యంగా వేరే జిల్లాను పరీక్షా కేంద్రంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సరిపడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయలేదనే అసమ్మతులు వినిపిస్తున్నాయి.
