Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణపై కరోనా పంజా... ఒకే అపార్ట్ మెంట్ లో 23మందికి, మొత్తం 55 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 55 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 

Today corona update in telangana
Author
Hyderabad, First Published May 16, 2020, 9:41 PM IST

హైదరాబాద్: కరోనా మహమ్మారి తెలంగాణపై మరోసారి పంజా విసిరింది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 55 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ మాదన్నపేటలోని ఒకే అపార్ట్ మెంట్ లో ఏకంగా 23 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై ఆ  అపార్ట్ మెంట్ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధితో మొత్తంగా 43 కేసులు బయటపడ్డాయి. అలాగే రంగారెడ్డిలో 2, యాదాద్రిలో 4, సంగారెడ్డిలో 2, జగిత్యాలలో 2, జనగాంలో 1, మంచిర్యాలలో 1 కేసు బయటపడింది. 

ఓ వైపు లాక్ డౌన్ సడలింపులు.. మరో వైపు అంతకంతకూ పెరుగుతున్న కేసులతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.ప్రభుత్వ ఆదేశాలతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధానంగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఒక్కో ఏఎన్‌ఎంకు.. వంద ఇళ్లు కేటాయించారు.

Also Read:హైదరాబాద్ పై కరోనా పంజా.. ఒక్క రోజులో 40పాజిటివ్ కేసులు

మూడు, నాలుగు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని వీరికి ఆదేశాలు అందాయి. తెలంగాణ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం వల్ల వలస కూలీలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు కరోనా వ్యాప్తిపై ఇవాళ్టీ నుంచి దేశంలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కలిగిన 60 జిల్లాల్లో ఈ సర్వే జరగనుంది. ఐసీఎంఆర్ సర్వే చేసే జిల్లాల్లో, తెలంగాణకు చెందిన జనగాం, నల్గొండ, కామారెడ్డి జిల్లాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో సామాజిక స్థాయికి కరోనా వ్యాప్తి జరిగిందా..? అనే కోణంలో ఈ సర్వే జరగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios