తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉదృతి... ఒక్కరోజే భారీగా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత 24గంటల్లో 2,154 పాజిటివ్ కేసులు బయటపడ్డట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,04,748కి చేరింది.
ఇక ఇప్పటికే కరోనా సోకినవారిలో గత 24గంటల్లోనే 2,239 మంది రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 1,77,008కి చేరింది. ప్రస్తుతం దేశ రికవరీ రేటు 84.9శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం అది 86.45 శాతంగా వుంది.
గత 24 గంటల్లో కరోనాతో 8మంది చనిపోయినట్లు వైద్యారోగ్య ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1189కి చేరింది. మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.5శాతంగా వుంటూ రాష్ట్రంలో 0.58శాతంగా వుంది.
read more తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉదృతి...ఆ ఆరు జిల్లాలే టాప్
అలాగే మంగళవారం మొత్తం 54,277 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 33,46,472కు చేరింది.
జిల్లాల వారిగా కరోనా వ్యాప్తిని పరిశీలిస్తే ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధిలో 303 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత రంగారెడ్డి 205, మేడ్చల్ 187, ఖమ్మం 121, నల్గొండ 124 కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 92, కరీంనగర్ 96, నిజామాబాద్ 60, సంగారెడ్డి 63, సిద్దిపేట 78, సూర్యాపేట79, వరంగల్ అర్బన్ 74 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తక్కువగానే వుంది.
పూర్తి వివరాలు: