తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 1,416 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. 

today 1st november corona update in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉదృతి ఇటీవల కాస్త తగ్గినా మళ్లీ కొద్దికొద్దిగా పెరుగుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటనను బట్టి తెలుస్తోంది. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు)  రాష్ట్ర వ్యాప్తంగా 41,675 మందికి టెస్టుల చేయగా 1,416 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 43,23,666కు చేరగా కేసుల సంఖ్య 2,40,048కి చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారిన పడినవారిలో తాజాగా 1,579మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య  2,20,466కి చేరింది. అయితే ఈ మహమ్మారి కారణంగా తాజాగా ఐదురుగు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1341కి చేరింది. 

read more   తెలంగాణ కరోనా వ్యాప్తి: కొత్తగా 1445 పాజిటివ్ కేసులు, ఆరు మరణాలు

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో అది 1.5శాతంగా వుంది. అలాగే రికవరీ రేటు రాష్ట్రంలో 91.84శాతంగా వుంటే దేశంలో 91.5శాతంగా వుంది. తాజా కేసులతో కేసులతో కలుసుకుని రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,241కి చేరింది. 

జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్)లో అత్యధికంగా 279, రంగారెడ్డిలో 132, మేడ్చల్ లో 112 కేసులు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం 79, కరీంనగర్ 74, ఖమ్మం 74, నల్గొండ 82 కేసులు బయటపడగా మిగతా జిల్లాల్లో కాస్త తక్కువగానే వున్నాయి. 

పూర్తి వివరాలు

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios