తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి యధావిధిగా కొనసాగుతోంది. తాజాగా తెలంగాణలో 1445 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, 6 మరణాలు సంభవించాయి. హైదరాబాదులో కరోనా ఉధృతి యధావిధిగా ఉంది.

హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 107 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మేడ్చెల్ లో 122 కేసులు రికార్డయ్యాయి. హైదరాబాదులో 286 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1445 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 38 వేల 632కు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా కొత్తగా ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య1336కు చేరుకుంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ కు చికిత్స పొంది కోలుకుని ఆస్పత్రుల నుంచి 2.18 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 18409 యాక్టివ్ కేసులున్నాయి. 

తెలంగాణలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

ఆదిలాబాద్ 19
భద్రాద్రి కొత్తగూడెం 90
జిహెచ్ఎంసీ 286
జగిత్యాల 35
జనగామ 25
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 10
కామారెడ్డి 22
కరీంనగర్ 65
ఖమ్మం 77
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 28
మహబూబాబాద్ 19
మంచిర్యాల 18
మెదక్ 22
మేడ్చెల్ మల్కాజిగిరి 122
ములుగు 22
నాగర్ కర్నూలు 23
నల్లగొండ 102
నారాయణపేట 4
నిర్మల్ 22
నిజామాబాద్ 18
పెద్దపల్లి 25
రాజన్న సిరిసిల్ల 26
రంగారెడ్డి 107
సంగారెడ్డి 27
సిద్ధిపేట 43
సూర్యాపేట 29
వికారాబాద్ 22
వనపర్తి 21
వరంగల్ రూరల్ 17
వరంగల్ అర్బన్ 53
యాదాద్రి భువనగిరి 18

Scroll to load tweet…