టైమ్స్ నౌ నవభారత్ ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత ఓటు షేర్ లభిస్తుందని ఓ సర్వే చేసింది. దీని ప్రకారం, కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటాయో అంచనా వేసింది. 

హైదరాబాద్: ఎన్నికల్లో ప్రజా నాడిని పట్టుకోవడం అంత సులువు కాదు. రాజకీయాలే డైనమిక్‌గా ఉంటాయి. ఏ క్షణంలో ఏం జరిగేది చెప్పలేం. ఫలితాలు అంతకు మించి చంచలంగా ఉంటాయి. వీటిని అంచనా వేయడానికి ఎంచుకునే మార్గాల్లో సర్వేలు ఒకటి. టౌమ్స్ నౌ నవభారత్ టైమ్స్ ఓ సర్వే చేపట్టింది. ఇప్పటికిప్పుడు దేశంలో లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ఎంత ఓటు షేర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? అనే విషయాలను సర్వే ఆధారంగా చర్చించింది.

ఆ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమి మరోసారి మెజార్టీతో కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసుకోగలదు. 543 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి (ఎన్‌డీఏ) 285 నుంచి 325 స్థానాల వరకు గెలుచుకోగలదని టౌమ్స్ నౌ నవభారత్ టైమ్ అంచనా వేసింది. కాగా, కాంగ్రెస్ కూటమి 111 నుంచి 149 సీట్లను గెలుచుకోగలదని తెలిపింది. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిది నుంచి 11 స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని వివరించింది. కాగా, బీజేపీ మూడు నుంచి ఐదు ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. అదే కాంగ్రెస్ రెండు నుంచి మూడు సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది.

Scroll to load tweet…

ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అక్కడ వైసీపీ హవా ఇంకా బలంగా కొనసాగుతున్నదని ఈ సర్వే తెలిపింది. ఇక్కడ 24 నుంచి 25 ఎంపీ సీట్లను అధికార వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది. టీడీపీ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉన్నదని వివరించింది.

Also Read: ఖమ్మం సభ.. కాంగ్రెస్‌లో జోష్.. బీజేపీలో టెన్షన్

ఇక తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరిగితే పార్టీల వారీగా ఓటు షేర్‌నూ ఈ సర్వే అంచనా వేసింది. ఓటు షేర్‌లోనూ బీఆర్ఎస్ తన స్థానాన్ని పటిష్టంగానే ఉంచుకున్నట్టు వెల్లడవుతున్నది. బీఆర్ఎస్‌ 37.10 శాతం, బీజేపీ 25.30 శాతం, కాంగ్రెస్ 29.20 శాతం ఓటు షేర్ నమోదు చేసుకుంటుందని ఈ సర్వే వివరించింది.

Scroll to load tweet…

2019 లోక్ సభ ఫలితాలతో పోల్చితే..

2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయ పార్టీల ఓటు షేర్‌తో పోల్చితే.. బీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గుతుందని ఈ సర్వే పేర్కొంది. 2019లో టీఆర్ఎస్‌కు 41.29 శాతం ఓటు షేర్ దక్కింది. అదే బీజేపీ పుంజుకున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది. 2019లో బీజేపీకి 19.45 శాతం ఓటు షేర్ ఉండగా.. ఈ సర్వే 25.30 శాతం ఓటు షేర్ లభిస్తుందని వివరించింది. కాంగ్రెస్ యథాతథ స్థితిలో ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. 2019లో 29.48 శాతం ఓటు షేర్ నమోదు చేసుకున్న కాంగ్రెస్ ఇప్పడు లోక్ సభ ఎన్నికలు జరిగితే 29.20 శాతం ఓటు షేర్ దక్కించుకుంటుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే వెల్లడించింది.