Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల దాడులు.. భయాందోళనలో స్థానికులు

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులుల సంచారం కలకరం రేపుతున్నాయి. ఈ పులులు మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి. గడిచిన 19 రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇద్దరు మృతి చెందారు. 

Tiger attacks in Telangana and Maharashtra border villages.. Locals in panic
Author
First Published Dec 5, 2022, 10:06 AM IST

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులులు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తూ వెళ్తూ ఉన్నాయి. ఈ సమయంలో అవి మూగ జీవాలపైన, మనుషులపైన దాడి చేస్తున్నాయి. గడిచిన 19 రోజుల్లో రాష్ట్ర సరిహద్దుల్లో ఇప్పటి వరకు ఇద్దరు ఆదివాసీ రైతులను పులి చంపేసింది. ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.

మహాకాల్ ఆలయంలో మహిళల డ్యాన్స్ వీడియో వైరల్... ఇద్దరు సెక్యురిటీ సిబ్బంది సస్పెండ్..

తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌లో నవంబర్ 15న ఆదివాసి రైతు సిడాం భీమ్ పులి చేతిలో హతమయ్యాడు. డిసెంబర్ 3వ తేదీన మహారాష్ట్రలోని రాజూరా తాలూకా లక్కడ్‌కోట్ గ్రామపంచాయతీలోని ఆనందగూడలో మరో ఆదివాసి రైతు కుర్సెంగ జంగు (60) ను కూడా పులి చంపేసింది. ఈ ఘటనలతో సరిహద్దు గ్రామాలు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాయి. 

చేనులో జంగు పత్తి సేకరిస్తుండగా కొన్ని వింత శబ్దాలు రావడంతో కుర్సెంగ పొలంలోకి వెళ్లాడు. దీంతో  పులి దాడి చేసింది. తరువాత అతడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అనందగూడ గ్రామస్తులు పత్తి సేకరించేందుకు వ్యవసాయ పొలాలకు వెళ్లడమే మానేశారు. ఈ గ్రామం తెలంగాణ సరిహద్దుకు 4 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వీరూర్‌లో 15 రోజుల క్రితం పలి దాడి చేయడంతో మరో రైతు చెందాడు. అతడి మృతదేహాన్ని పొలంలోకి 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. అదే పొలంలో పత్తి తీస్తున్న కూలీలకు పులి గర్జన వినిపించింది. అక్కడికి వెళ్లి చూస్తే మృతదేహాం లభించింది. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

కాగా.. పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీ సిబ్బంది కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో పులుల సంచారం, వాటి సంఖ్య బాగా పెరిగింది. ఈ పులులు తడోబా అంధారి టైగర్ రిజర్వ్, తిపేశ్వర్ టైగర్ రిజర్వ్‌కు ఇరువైపులా ఉన్న గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబరు 4న తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో నాలుగు పెద్ద పిల్లల కళేబరాన్ని అటవీ సిబ్బంది కనుగొన్నారు. వాటి మరణానికి కారణం స్పష్టంగా తెలియరాలేదని ‘డెక్కన్ క్రానికల్’ నివేదించింది.

ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల అక్కాచెళ్లెళ్లు...! 

తెలంగాణ సరిహద్దులోని వాంకిడిలో రైతును చంపిన పులి మహారాష్ట్ర సరిహద్దులో రైతును బలితీసుకుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇది ప్రధానంగా పొలాల్లో రైతులు పత్తి ఏరుకునే కాలం. ఈ సమయంలో కొన్ని పులులు నరమాంస భక్షకులుగా మారి రాష్ట్ర సరిహద్దుల వెంబడి చురుకుగా తిరుగుతూ మనుషులపై దాడి చేస్తున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఆనందగూడలో రైతుపై దాడి చేసిన పులి నరమేధం కాదని, ఖానాపూర్, ఆనందగూడ ఘటనల్లో ప్రమేయం ఉన్న పులుల పగ్ గుర్తులకు పొంతన లేదని మహారాష్ట్రలోని వీరూర్ ఫారెస్ట్ రేంజ్ ఫారెస్ట్ గార్డు సుమేధ్ సిండే ‘డెక్కన్ క్రానికల్’తో తెలిపారు. పులుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల పరిహారాన్ని రూ.20 లక్షలకు పెంచిందని తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా సుధీర్ ముంగంటివార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇలాంటి ఘటనలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే పరిహారంగా ఇస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios