గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిలక రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నిలక రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సబర్మతి నియోజకవర్గం ఓటరు అయిన మోదీ అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రధాని మోదీ ఓటు వేసేందకు వెళ్తున్న సమయంలో రోడ్లపై ఉన్న చాలా మంది ప్రజలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రధాని మోదీ వారికి అభివాదం చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓటు హక్కును వినియోగించుకను్నారు. అనంతనం పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన మోదీ.. ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా గుర్తు ఉన్న వేలును చూపించారు.
ఇక, ప్రధాని మోదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆదివారం గాంధీనగర్‌లోని తన తల్లి హీరాబెన్‌ను ఆమె నివాసంలో కలిశారు. అక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ వేళ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోదీ గాంధీనగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.
ఇక, ఈ రెండోదశ పోలింగ్‌లో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. గుజరాత్ ఎన్నికల రెండో విడతలో 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 2.51 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇక, తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.