హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై (Tank Bund) బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు, కారు ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై (Tank Bund) బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు, కారు ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల చిన్నారి శ్రీ మృతిచెందింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులతో సామాన్య, శివకుమార్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సామాన్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
బాధితులు రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ (cab driver) నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గాంధీ నగర్ పోలీసులు తెలిపారు.
