కాగజ్‌నగర్‌లోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో బాలిక ఐశ్వర్య మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్‌వో స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీ టీచర్ శ్రీలతలను సస్పెండ్ చేస్తూ గురువారం అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాగజ్‌నగర్‌లోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో బాలిక ఐశ్వర్య మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిలో భాగంగా ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎస్‌వో స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీ టీచర్ శ్రీలతలను సస్పెండ్ చేస్తూ గురువారం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా .. ఎనిమిదో తరగతి చదువుతోన్న నాగోసే ఐశ్వర్య తనకు తలనొప్పిగా వుందంటూ ఐశ్వర్య సోమవారం రాత్రి సహచార విద్యార్ధులకు చెప్పి పడుకుంది.
ALso REad:కాగజ్‌నగర్ కస్తూర్భా గాంధీ పాఠశాలలో విద్యార్థిని మృతి, బంధువుల విధ్వంసం
అయితే తర్వాతి రోజు ఉదయం ఐశ్వర్య ఎంతకూ నిద్రలేకపోవడంతో తోటి విద్యార్ధులకు అనుమానం వచ్చింది. ఇదే సమయంలో ఆమె ముక్కు, నోటిలోంచి నురగ వస్తుండటంతో అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఐశ్వర్య మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే విద్యార్ధిని మృతిపై తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు బుధవారం పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.
