మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని బాలయ్య నగర్‌లోని బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చింది.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్థానికంగా ఉన్న క్వారీ వద్ద నీటి గుంతలో దుస్తులు ఉతుకేందుకు వెళ్ళారు. ఈ సమయంలో ముగ్గురు అదుపు తప్పి క్వారీలో పడి మరణించారు. మృతులను ఐలమ్మ (65), అనిత (30), యశ్వంత్‌ (10) గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.