మైనంపల్లికి చెక్... పరిశీలనలో మూడు పేర్లు..

మైనంపల్లి హనుమంతరావుపై వేటు వేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన మల్కాజిగిరి స్థానానికి ఆయనకు బదులు మరో మూడు పేర్లు పరిశీలిస్తోంది. 

Three names under scrutiny for Malkajigiri seat over Mynampally - bsb

హైదరాబాద్ : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ లో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తొలి విడత జాబితా ప్రకటించినప్పటి నుంచి ఆయన హరీష్ రావును టార్గెట్ చేస్తూ  తీవ్రస్థాయిలో విమర్శలు  చేశారు. ఈ నేపథ్యంలో  రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా తీవ్ర  నిరసనలు వ్యక్తం చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం మైనంపల్లి హనుమంతరావుకు కేటాయించిన మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్ తొలివిడత అభ్యర్థుల జాబితాలో మైనంపల్లి పేరు ఉండడం.. అంతకు ముందే ఆయన కోరినట్లుగా తన కొడుకు రోహిత్ కు  టికెట్ కేటాయించకపోవడంతో రచ్చ మొదలయ్యింది. మల్కాజిగిరి నుంచి తనకు,  మెదక్ టికెట్ తన కొడుకుకు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.  లేకపోతే ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని  సోమవారం ప్రకటించారు.

Telangana Police: తప్పుడు సమాచార వ్యాప్తిపై తెలంగాణ హోంమంత్రి ఆందోళన..

ఇదంతా అభ్యర్థుల జాబితా విడుదల కాకముందే జరిగింది. ఆ తరువాత విడుదలైన జాబితాలో మైనంపల్లి హనుమంతరావు పేరు ఉండడంతో విలేకరులు ఈ విషయాన్ని కెసిఆర్ దగ్గర ప్రస్తావించారు. ‘దీనికి ఆయన సమాధానం చెబుతూ.. టికెట్ కేటాయించాం.. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలా లేదా? అనేది ఆయన ఇష్టం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత  మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు కూడా మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.

మంగళవారం నాడు కూడా మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మైనంపల్లి దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు కార్యకర్తలు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మల్కాజిగిరి నుంచి కొత్త అభ్యర్థిని ప్రకటించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

మెదక్ అసెంబ్లీ స్థానంలో గత కొంతకాలంగా మైనంపల్లి రోహిత్ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ టికెట్ రోహిత్ కే ఇవ్వాలంటూ ఆయన అనుచరులు కూడా ఆందోళన నిర్వహించారు. అయితే ఈసారి మెదక్ నియోజకవర్గం నుంచి పద్మా దేవేందర్ రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని పార్టి స్పష్టత ఇచ్చింది. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా తనకు రెండు స్థానాలు కావాలంటూ అడగడం, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది.

మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావు తొలగించి ఆ స్థానంలో ఎవరిని పోటీకి నిలపాలి అని ఆలోచిస్తుంది. దీనికోసం  మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు మరో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. విజయావకాశాలు మెండుగా ఉన్న అభ్యర్థిని పోటీకి నిలవాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి సీనియర్ నాయకులకు కూడా కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు మాత్రమే అనివార్య పరిస్థితుల్లో ఆ అవకాశం దక్కింది. మరి ఇక్కడ కూడా మైనంపల్లి అనుకున్నది సాధ్యం కాకపోతే ఆయన పయనం ఎటువైపు అని  గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios