భర్తను కారులో బంధించి.. తమ లైంగిక వాంఛ తీర్చాలని బెదిరింపులకు గురి చేసి.. అర్ధరాత్రి నడిరోడ్డుపై లైంగికదాడికి యత్నించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళల, చిన్నారుల రక్షణ కోసం.. ఎన్నో కఠినతరం చట్టాలను తీసుకవచ్చిన ఫలితం లేకుండా పోయింది. నిత్యం మహిళలు ఎదోక చోట అవమానాల్లో కూరుకుపోతూ, అన్యాయానికి గురవుతున్నారు. హత్యలకూ అత్యాచారాలకూ బలవుతునే ఉన్నారు. తాజాగా తన భర్తను కారులో బంధించి.. తమ లైంగిక వాంఛ తీర్చాలని బెదిరింపులకు గురి చేసి.. అర్ధరాత్రి నడిరోడ్డుపై లైంగికదాడికి యత్నించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో నివాసం ఉండే ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య (36), ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే.. ఆయన ఈ నెల 4వ తేదీన ఓ పని మేరకు చినమెట్‌పల్లికి వెళ్లాడు. ఈ క్రమంలో మద్యం పుల్ గా తాగి.. అక్కడే పడిపోయాడు. ఈ విషయాన్ని చూసి భీమునిదుబ్బ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నాగరాజు (26), తిరుపతి (24), రఘు (24) అతన్ని కోరుట్లలో డ్రాప్ చేస్తామని.. తమ కారులో ఎక్కించుకున్నారు. ఈ సమయంలో అతని ఫోను నుంచి అతడి భార్యకు ఫోన్‌చేశారు.నీ భర్త మా వద్ద ఉన్నాదనీ.. మా కామ వాంఛ తీరుస్తేనే.. నీ భర్తను అప్పగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. భీమునిదుబ్బలోని బర్రెల మంద వద్దకు రావాలని బెదిరించారు.
భీముని దుబ్బకు చేరుకున్న తర్వత మరోసారి ఆమెకు ఫోన్ చేసి.. త్వరగా రావాలని, రాత్రి మొత్తం తమతో గడపాలని ని బెదిరించారు. అయితే.. తన భర్తను అప్పజెప్పిన తరువాత.. ఎలా చెప్తే అలా వింటానని నిందుతులతో నమ్మబలింది. అదే సమయంలో తమ బంధువులకు, తన ఇరుగుపొరుగువారికి సమాచారం చేరవేసింది. తన భర్తను కొందరు దుండగులు అపహరించారనీ, వారి కోరిక తీర్చితేనే.. అప్పగిస్తారని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపింది.
నిందితుల చెప్పినట్టుగానే తన స్నేహితురాలతో కలిసి బర్రెల మంద వద్దకు వెళ్లింది. అక్కడ కారులో స్పృహ తప్పి ఉన్న భర్తను చూసి.. భయాందోళనకు గురైంది. తన భర్తను వదిలేయాలని నిందితులను ప్రాధేయపడింది. ఏ మాత్రం చలించిన వారు.. ఆమెపై నడిరోడ్డు మీద లైంగికదాడికి యత్నించారు. ఈ క్రమంలో తనతో వచ్చిన మరో మహిళ ఆ దాడిని మొత్తం తన ఫోన్లో చిత్రీకరించారు. ఇదే సమయంలో బాధితురాలి బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన.. నిందితుడులు పరారయ్యారు. ఈ విషయమై మరుసటిరోజు బాధిత వ్యక్తి తనను కిడ్నాప్ చేసి తనభార్యపై లైంగికదాడికి యత్నించారని ఆ ముగ్గురిపై కోరుట్ల ఎస్సై సతీశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
