Asianet News TeluguAsianet News Telugu

వికారాబాద్‌లో విషాదం: రైలింజన్ ఢీకొని ముగ్గురి మృతి

రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు రైల్వే  సిబ్బంది మరణించారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై బుధవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.

Three killed in train engine hitting in vikarabad
Author
Hyderabad, First Published Jul 22, 2020, 5:46 PM IST

వికారాబాద్: రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు రైల్వే  సిబ్బంది మరణించారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై బుధవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.

మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇదే సమయంలో రైలు ఇంజన్ హైద్రాబాద్ నుండి వికారాబాద్ వస్తోంది. ఇది గమనించి తొమ్మిది మంది ఉద్యోగులు తప్పుకొన్నారు. కానీ, ముగ్గురు మాత్రం రైల్ ఇంజన్ వస్తున్న విషయాన్ని గుర్తించలేదు. దీంతో రైలు ఇంజన్ ఆ ముగ్గురిని ఢీ కొట్టింది. దీంతో ఆ ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించారు.

మరణించిన వారిని నవీన్, శంషీర్ అలీ, ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. గుంటూరు డీఆర్ఎంను విచారణ అధికారిగా నియమించింది రైల్వేశాఖ. 

రైల్వే శాఖలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల రైల్వే శాఖలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందునన్నారు. ఇవాళ జరిగిన ప్రమాదానికి కారణం ఎవరనే విషయమై రైల్వే శాఖాధికారులు ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే కార్మికులు కోరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios