యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మల్కాపురం వద్ద ఉన్న పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులు విధులకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే హైద్రాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
