నిజామాబాద్‌లో మహిళపై ముగ్గురు అత్యాచారయత్నం: కాపాడిన పోలీసులు , ముగ్గురి అరెస్ట్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం మహంతంలో మహిళపై ముగ్గురు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే 100కు బాధితురాలు ఫోన్ చేయడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్: ఉమ్మడి Nizambad జిల్లాలోని నవీపేట మండలం మహంతంలో Woman పై ముగ్గురు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. అయితే మహిళ 100కి ఫోన్ చేయడంతో Police సంఘటన స్థలానికి చేరుకొని మహిళను కాపాడారు. మహిళపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చినా కూడా నిందితుల్లో మార్పులు రావడం లేదు. ముంబైలోని ధారవిలో యువతిపై ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 17న వెలుగు చూసింది.
also read:digital rape : మైనర్‌పై ఏడేళ్ల పాటు డిజిటల్ రేప్.. 81 ఏళ్ల టీచర్ ను అరెస్టు చేసిన పోలీసులు
గతంలో అదే ప్రాంతంలో అనిల్ చౌహాన్ అతని సోదరుడు నీలేష్ లు నివసించేవారు. అయితే వారితో ఆ సమయంలో ఆమె స్నేహం చేసింది. ఇటీవల ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఈ యువకులు చొరబడ్డారు. ఆమెను కత్తితో బెదిరించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యను నిందితులు వీడియో కూడా తీశారు. ఈ ఘటనను ఎవరికైనా చెబితే వీటిని బయటపెడతామని బెదిరించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులైన ఇద్దరు అన్నదమ్ములను అరెస్టు చేశారు.
ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికకు మత్తు పదార్థాలు అందించి ఆపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన మే 8వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
డబ్బుల ఆశ చూపి ఆ బాలికపై దుండగులు సామూహిక లైంగికదాడి చేశారు. ముందుగా ఆమెకు మత్తు పదార్థాలు అందించారు. ఐదుగురు నిందితులు ఒకరి తరువాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ ఐదుగురు దుండగులు బాధితురాలికి తెలిసినవారే. ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత ఎవరికి చెప్పవద్దని నిందితులు హెచ్చరించారు. ఆమె కుటుంబ సభ్యులకు తెలిపినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. కానీ, ఒక రోజు ఆమె మర్మాంగాల్లో తీవ్ర నొప్పితో కుప్పకూలిపోయింది. దీంతో బాధితురాలి బాలికకు విషయం తెలియవచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్ లో నివాసం ఉండే 50 ఏళ్ల డాక్టర్ కొన్ని నెలలుగా ట్యూషన్ టీచర్ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. డాక్టర్ పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఓ టీచర్ అతడి ఇంటికి వచ్చేది. ఆ సమయంలో ఆ డాక్టర్ టీచర్ పై కన్నేశాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా కొన్ని ఫొటోలు తీశాడు. వాటిని అసభ్యకరంగా ఎడిట్ చేసి, వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని బాధితురాలు ఆరోపించారు.
మార్ఫింగ్ చేసి ఫొటోలు, వీడియోలు చూపించి ఆమెను బెదిరించి నెలల తరబడి అత్యాచారం చేస్తూనే ఉన్నా డు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఆ గర్భం పోయేందుకు డాక్టర్ ఆమెకు మందులు ఇచ్చాడు. ఆ మందుల ప్రభావం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ఆరా తీశారు. తనపై కొన్ని నెలలుగా జరుగుతున్న దారుణ ఘటనను ఆమె వారికి తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ పై బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.