హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురికి కరోనా సోకింది. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే నర్సుకు కూడ కరోనా సోకినట్టుగా వైద్యులు తేల్చారు. సాధారణ ప్రజలతో పాటు వైద్య సిబ్బంది, వైద్యులు కూడ కరోనా బారిన పడడం ఆందోళన కల్గిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స  అందించేందుకు గాను గాంధీ ఆసుపత్రిని ప్రత్యేకంగా కేటాయించారు. కరోనా సోకిన రోగుల్లో ఎక్కువ భాగం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిమ్స్, ఉస్మానియా, పేట్లబురుజు తదితర ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా సోకింది. పీఏల కుటుంబసభ్యులకు కూడ కరోనా సోకినట్టుగా  వైద్యులు నిర్ధారించారు. 

తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాటికి కరోనా కేసులు 11,364 కి చేరుకొన్నాయి. గురువారం నాడు ఒక్క రోజునే రాష్ట్రంలో 920 కేసులు నమోదయ్యాయి.జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీలో కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

గచ్చిబౌలిిలో టిమ్స్  ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. 1700 బెడ్స్ ను, వెంటిలేటర్స్ ను అమర్చనున్నారు.