కుటుంబ కలహలతో ముగ్గురు కూతుళ్లను చంపి పోలీసులకు లొంగిపోయాడు ఓ తండ్రి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నాడు చోటు చేసుకొంది.
నిజామాబాద్: కుటుంబ కలహలతో ముగ్గురు కూతుళ్లను చంపి పోలీసులకు లొంగిపోయాడు ఓ తండ్రి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నాడు చోటు చేసుకొంది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాజారాం దుబ్బాకలో దారుణం చోటు చేసుకొంది. ముగ్గురు కూతుళ్లను ఫయాజ్ గ్రామంలోని చెరువులో వేసి హత్య చేశాడు. బాన్సువాడ మండలం తాడ్కోలు గ్రామంలోని చెరువులో ముగ్గురు పిల్లలను ముంచి హత్యకు పాల్పడ్డాడు.
Also read:మహిళలు స్నానం చేస్తుండగా మొబైల్‌తో రికార్డ్: నిందితుడికి దేహశుద్ది, అరెస్ట్
శుక్రవారం నాడు ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి ముగ్గురు పిల్లలను ఆయన తీసుకెళ్లాడు. చెరువు వద్దకు వెళ్లి ఈ ముగ్గురిని చెరువులో ముంచి చంపాడు,. అక్కడి నుండి నేరుగా బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
ముగ్గురు పిల్లలను చంపిన విషయాన్నిపోలీసులకు చెప్పడంతో పోలీసులు చెరువు వద్దకు వెళ్లి చూస్తే మూడు మృతదేహలు నీళ్లలో కన్పించాయి. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహలతోనే నిందితుడు ఈ దారునానికి ఒడిగట్టినట్టుగా అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి తనతో గొడవపడేవాడని ఆమె పోలీసులకు చెప్పారు.
