Asianet News TeluguAsianet News Telugu

అజహరుద్దీన్ పై మూడు కేసులు.. ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్ళలో అవకతవకలు..

క్రికెటర్ అజహరుద్దీన్ పై మూడు కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్ల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు కేసులు పెట్టారు. 
 

Three cases against Azharuddin, hyderabad - bsb
Author
First Published Oct 20, 2023, 2:07 PM IST

హైదరాబాద్ : హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్ల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు అయ్యాయి. అజారుద్దీన్ తో పాటు హెచ్ సీఏ మాజీ కార్యదర్శి విజయానంద్, మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ పై రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.

దీనికి సంబంధించి కేసులు నమోదు కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఇందులో ఫైర్ విన్ సేఫ్టీ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాడీ  డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సారా స్పోర్ట్స్,  ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్ అనే నాలుగు సంస్థలకు ఈ అవకతవకులతో సంబంధం ఉన్నట్లుగా ఎఫైర్ లో నమోదు చేశారు.  దీంతో పాటు ఎఫ్ఐఆర్లో  అగ్నిమాపక సామాగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రాష్ట్రానికి 20 వేల కేంద్ర బలగాలు

దీనికి సంబంధించి అప్పట్లో న్యాయస్థానం నియమించిన జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ పర్యవేక్షక కమిటీ దృష్టికి తీసుకు రాకుండానే సదరు అగ్నిమాపక సామాగ్రి కోసం కాంట్రాక్టు ఇచ్చారని తెలిపారు. హెచ్ సీఏకు క్రికెట్ బాల్స్ కొనే విషయంలో దాదాపుగా రూ.57.07 లక్షల నష్టం వాటిలిందని.. ట్రెడ్ మిల్ లాంటి జిమ్ కు సంబంధించిన ఇతర సామాగ్రి కూడా నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. దీంతోపాటు స్టేడియం కోసం కొన్న బకెట్ కుర్చీల కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరిగాయని.. వీటి ధరలు పెంచడం వల్ల రూ.43.11 లక్షల నష్టం వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios